నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 26 ఏళ్ల యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనంపై పార్లమెంటుకు వచ్చిన అతడు... కత్తి పట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే గుర్తించిన పోలీసులు అతడిని పార్లమెంటు పోలీస్ స్టేషన్కు తరలించారు.
పార్లమెంటు ఆవరణలోకి కత్తితో యువకుడు! - parliament hose
పార్లమెంటు భవనంలోకి ఓ యువకుడు కత్తితో ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. గుర్తించిన పోలీసులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పార్లమెంటు పోలీస్ స్టేషన్కు తరలించారు.
పార్లమెంటు ఆవరణలోకి కత్తితో యువకుడు!
యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని అనుమానిస్తున్నట్లు దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఇష్ సింఘాల్ అన్నారు. అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ధనోవా సమక్షంలో అభినందన్ యుద్ధ విన్యాసాలు!
Last Updated : Sep 29, 2019, 4:08 AM IST