తెలంగాణ

telangana

By

Published : Dec 23, 2019, 11:54 AM IST

Updated : Dec 23, 2019, 1:51 PM IST

ETV Bharat / bharat

థాయ్​లాండ్​ నుంచి ఉడత, ఎలుకలు స్మగ్లింగ్​- ఒకరు అరెస్ట్

జంతువులను అక్రమంగా తరలిస్తూ చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. అంతరించిపోతున్న జాతులను థాయ్​లాండ్​ నుంచి తరలిస్తూ కస్టమ్స్​ అధికారులకు చిక్కాడు.

థాయ్​లాండ్​ నుంచి ఉడత, ఎలుకలు స్మగ్లింగ్
థాయ్​లాండ్​ నుంచి ఉడత, ఎలుకలు స్మగ్లింగ్

థాయ్​లాండ్​ నుంచి ఉడత, ఎలుకలు స్మగ్లింగ్​- ఒకరు అరెస్ట్

చెన్నై విమానాశ్రయంలో జంతువుల స్మగ్లర్​ను అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. థాయ్​లాండ్​ నుంచి అరుదైన జీవరాశులను తరలిస్తూ చెన్నైలోని అధికారులకు చిక్కాడు మహ్మద్ మొయిద్దీన్​.

పక్కా సమాచారంతో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొయిద్దీన్​ అనుమానాస్పదంగా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు.

మొయిద్దీన్ దగ్గర ఎర్ర ఉడత, 12 కంగారూ ఎలుకలు, 3 ప్రియరీ కుక్కలు, 5 బ్లూ లాగూనాలు ఉన్నాయి. ఇవన్నీ అంతరించిపోతున్న జీవరాశుల జాబితాలో ఉన్నాయి. ఈ జంతువులను తిరిగి థాయ్​లాండ్ పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చును.. మొయిద్దీన్​ నుంచి వసూలు చేస్తామన్నారు.

ఇదీ చూడండి: 'నాన్నా.. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో గుడ్​బై'

Last Updated : Dec 23, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details