కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు రైతులు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం యూఏఈ నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. తన వివాహ సన్నాహాలను వాయిదా వేసుకున్నాడు. నేరుగా దిల్లీ సరిహద్దులకు చేరుకొని ఆందోళనల్లో పాల్గొన్నాడు. పంజాబ్‌కు చెందిన సత్నాం సింగ్. ఈ ఉద్యమంలో గెలిచే వరకు వెనుదిరిగేది లేదని చెబుతున్నాడు.
ఇదీ జరిగింది..
పంజాబ్ జలందర్ జిల్లాకు చెందిన సత్నాం సింగ్ (29).. ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం యూఏఈకి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలని నిశ్చయింకున్నాడు. అందుకోసం రెండు నెలల సెలవుపై నవంబర్ 29న స్వగ్రామం చేసుకున్నాడు.