తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య - Ghaziabad young man killed

నడిరోడ్డుపై ఓ యువకుడిని ఇనుపరాడ్లతో కొట్టి చంపిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. బాధితుడు రక్తపుమడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూల దుకాణం పెట్టుకునే విషయంపై తలెత్తిన గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.

Man beaten to death in broad daylight in Ghaziabad
నడిరోడ్డుపై ఇనుపరాడ్లతో బాది యువకుడి హత్య

By

Published : Dec 29, 2020, 2:50 PM IST

మానవత్వం లేకుండా కర్కశంగా ఓ యువకుడి ప్రాణాలు తీశారు ఇద్దరు దుండగులు. రోడ్డుపైనే అజయ్ అనే యువకుడిని ఇనుప రాడ్డులతో చితకబాది చంపారు. ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో 'లోనీ' పట్టణం​లో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

బాధితుడు రక్తపుమడుగులో పడిపోయి ఉన్నప్పటికీ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు, వాహనదారులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సమీపంలోని వ్యక్తి ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది.

బాదితుడిపై దాడి వీడియో

నగరంలో పూల దుకాణం పెట్టుకునే విషయంపై బాధితుడికి.. నిందితుడికి మధ్య తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై బాధితుడి సోదరుడు ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపించారు పోలీసులు.

కాగా.. తాజా దాడికి పాల్పడిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details