తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొసళ్లతో నీ స్నేహం భలే ఉంది గురూ! - HUMAN INTERESTED NEWS

హరియాణాలోని భోర్​ సైదా గ్రామంలో బసంతి, తారా చంద్​​​ మంచి స్నేహితులు. తారా చంద్​​​ భోజనం పెట్టందే బసంతి తినదు. ఇంతకీ వారిద్దరూ ఎవరో తెలుసా? ఒకరు మనిషి మరొకరు మొసలి. ఇదేం స్నేహం అనుకుంటున్నారా? అయితే చూడండి.

man and crocodile unique friendship in kurukshetra
మొసళ్లతో నీ స్నేహం భలే ఉంది గురూ!

By

Published : Jan 10, 2020, 4:57 PM IST

Updated : Jan 10, 2020, 7:15 PM IST

మొసళ్లతో నీ స్నేహం భలే ఉంది గురూ!

హరియాణా కురుక్షేత్ర జిల్లా భోర్ సైదా గ్రామంలో మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉంది. దానికి పర్యవేక్షకుడిగా ఉంటున్న తారా చంద్​​, బసంతి అనే మొసలి మంచి స్నేహితులు. సరస్సు ఒడ్డున నిలబడి బసంతి అని పిలిస్తే... మొసలి ఎక్కడున్నా బయటకు వస్తుంది. ఆ మొసలికి ఆహారం అందిస్తాడు తారా చంద్​​.
బసంతితో పాటు ఆ ప్రదేశంలో చాలానే మొసళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ తారా చంద్​ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.

"చెరువు దగ్గరకు వెళ్లి బసంతి అని పిలవగానే మొసలి బయటకు వస్తుంది. దానికి కోళ్లు, చేపలు వంటి వాటిని ఆహారంగా ఇస్తాం. ఇప్పటి వరకు బసంతి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. కానీ దూరం నుంచే దానికి ఆహారాన్ని అందిస్తాం. నా పేరు తారా చంద్​.​ నన్ను గుర్తు పడుతుంది. అలాగే కాపలాదారు జయ్​పాల్​ పేరును కూడా గుర్తుపడుతుంది."

-తారా చంద్​, మొసళ్ల సంరక్షకుడు

స్వాతంత్య్రానికి ముందు ఈ ప్రాంతంలో ఓ సాధువు ఉండేవాడు. ఓ రోజు వరద నీటిలో రెండు మొసలి పిల్లలు ఇక్కడకు కొట్టుకొచ్చాయి. వాటిని చేరదీసి ఓ చిన్న గోతిలో పెంచాడు ఆ సాధువు. కాలం గడిచే కొద్దీ మొసళ్ల సంఖ్య పెరిగింది. అదే సమయంలో రైతులు, గ్రామస్థులంతా కలిసి మొసళ్ల సంరక్షనార్థం ఈ స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తారా చంద్​​, బసంతి కలిశారు. అలా వారివురి మధ్య మంచి స్నేహం చిగురించింది.

ఇదీ చూడండి: ఎల్లమ్మ దేవి కరుణించింది.. ఆమె చచ్చి బతికింది!

Last Updated : Jan 10, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details