తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య వివాహేతర సంబంధమే అతడి ప్రాణం తీసిందా? - బెంగాల్ నేర వార్తలు

బంగాల్​లో అనుమానస్పద రీతిలో ఓ మృతదేహం లభ్యమైంది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

man allegedly killed by wife with help of lover, decomposed body found in West Bengal
అనుమానస్పదరీతిలో వివాహేతర సంబంధంతో భర్తను హతమార్చిన భార్య!మృతదేహం లభ్యం- భార్యే కారణమా?

By

Published : Oct 29, 2020, 12:06 PM IST

పశ్చిమ్​బంగాలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడిని గైఘాటకు చెందిన రామకృష్ణ సర్కార్​(27)గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అధికారులు. అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. రామకృష్ణ భార్య స్వప్న సర్కార్​.. సుజిత్​ దాస్​ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుపుతన్నట్లు అనుమానించారు పోలీసులు. దీనికి తోడు సుజిత్​ నివాసంలోనే రామకృష్ణ మృతదేహం లభ్యమవడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వప్న, సుజిత్​లను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి-మేనేజర్​తో వాగ్వాదం- 61 సిలిండర్లతో పరార్​!

ABOUT THE AUTHOR

...view details