తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో అత్యాచార దోషి దారుణ హత్య - Rape convict hacked to death in Thrissur

అత్యాచార కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తి కేరళ త్రిస్సూర్ జిల్లాలో హత్యకు గురయ్యాడు. మృతుడు రెండు నెలల పెరోల్​ మీద బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Man accused in rape case hacked to death
అత్యాచార నిందితుడి దారుణ హత్య

By

Published : Oct 7, 2020, 1:46 PM IST

కేరళ త్రిస్సూర్ జిల్లా చెలక్కరా ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని ఎలనాడ్​కు చెందిన సతీశ్​​(38)గా గుర్తించారు.

మృతుడు సతీశ్​(38)

స్థానిక తిరుమణి కాలనీలో బాధితుడి​పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కత్తులతో నరికి చంపినట్లు గుర్తించారు. మృతదేహం ఓ ఇంటి ఎదుట అత్యంత దారుణమైన స్థితిలో లభించిందని, ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

మృతుడు రెండు నెలల పెరోల్​ మీద జైలు నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఓ గిరిజన బాలికపై అత్యాచారం చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నట్లు చెప్పారు.

అత్యాచార దోషి దారుణ హత్య
రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం
మృతదేహం

ఇదీ చదవండి-యోగీజీ.. విషాద ఘటనని ఒప్పుకోండి: రాహుల్​

ABOUT THE AUTHOR

...view details