తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2019, 1:08 PM IST

ETV Bharat / bharat

'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పౌరచట్టానికి వ్యతిరేకంగా లాంగ్​ మార్చ్​కు పిలుపునివ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆ రాష్ట్ర గవర్నర్​ జగదీప్ ధంఖర్​. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చెయ్యటం మంచిది కాదని అన్నారు.

'Mamata's decision to increse the violence'
'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంగ్ మార్చ్‌కు పిలుపునివ్వడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ తప్పుపట్టారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం సరికాదని ట్వీట్‌ చేశారు.

గవర్నర్​ ట్విట్​

మమత చర్యలు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను మరింత ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆరోపించారు. బంగాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కృషిచేయాలన్న జగదీప్ ధంఖర్‌...రాజ్యాంగ విరుద్ధమైన ఈ ర్యాలీ నుంచి మమత తప్పుకోవాలని కోరారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు కోల్‌కతాలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మమతా ట్విట్టర్‌లో పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ జగదీప్ ధంఖర్​.. దీదీని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details