తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఆర్​సీ పేరుతో నిప్పుతో చెలగాటమాడొద్దు'

జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) పేరుతో నిప్పుతో చెలగాటమాడొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎన్​ఆర్​సీని బెంగాల్​లో అనుమతించబోమని ఉద్ఘాటించారు. అసోం ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా కోల్​కతాలో ర్యాలీ నిర్వహించారు తృణమూల్​ కాంగ్రెస్ నేతలు​.

'ఎన్​ఆర్​సీ పేరుతో నిప్పుతో చెలగాటమాడొద్దు'

By

Published : Sep 12, 2019, 11:28 PM IST

Updated : Sep 30, 2019, 9:51 AM IST

అసోం ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా టీఎంసీ ర్యాలీ
జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) అమలుపై విమర్శలు గుప్పించారు పశ్చిమ బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎన్​ఆర్​సీ పేరుతో నిప్పుతో చెలగాటమాడొద్దని భాజపాను హెచ్చరించారు. బెంగాల్​లో పౌర రిజిస్ట్రీని అనుమతించబోమని మరోమారు స్పష్టం చేశారు.

అసోం ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా మమత నేతృత్వంలో ఉత్తర కోల్​కతాలోని సింతీ ప్రాంతం నుంచి శ్యామ్​బజార్​ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు తృణమూల్​ కాంగ్రస్​ నేతలు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా భాజపాపై నిప్పులు చెరిగారు మమత. ఎన్​ఆర్​సీ పేరుతో బెంగాల్​లోని ఒక్క పౌరుడినైనా ముట్టుకుని చూడండి అంటూ భాజపా నాయకులకు సవాలు విసిరారు.

" బెంగాల్​లో ఎన్​ఆర్​సీని ఎప్పటికీ అనుమతించం. కులం, మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు వారిని రాష్ట్రానికి రానివ్వం. అసోం ఎన్​ఆర్​సీని సమర్థించటం లేదు. అక్కడి ప్రజలను పోలీసు బలంతో అణిచివేస్తున్నారు కానీ బెంగాల్​లో అలా చేయలేరు."

- మమతాబెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం...

Last Updated : Sep 30, 2019, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details