తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం కావాలి' - కొలీజియం

ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక తరహాలో కొలిజీయం వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ తీరును తప్పు పట్టిన మమత.. నామినేటెడ్ ఎంపిక ద్వారా పదవుల్లోకి వచ్చే సభ్యులు ఎన్నికలను నియంత్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

'ఎన్నికల కమిషనర్ల నియమకానికి కొలీజియం కావాలి'

By

Published : Jun 7, 2019, 11:04 PM IST

Updated : Jun 7, 2019, 11:18 PM IST

'ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం కావాలి'

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికకు ఉపయోగించే కొలీజీయం విధానాన్ని ఎన్నికల కమిషన్​ సభ్యుల నియామకానికి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికైన ముగ్గురు కమిషన్ సభ్యులు ఎన్నికలను నియంత్రించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈవీఎంలపై నిజనిర్ధరణ కమిటీ

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్​కు గురయ్యాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజ నిర్ధరణ కమిటీ వేసి వాస్తవాలు బయటకు రాబట్టేందుకు డిమాండ్ చేయాలని విపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు దీదీ.

ఇదీ చూడండి: భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!

Last Updated : Jun 7, 2019, 11:18 PM IST

ABOUT THE AUTHOR

...view details