తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ: బంగాల్​లో దీదీ భారీ 'నిరసన ర్యాలీ' - MAMATA CUNDUCTED RALLY IN BENGAL

పౌరసత్వ చట్ట సవరణ, ఎన్​ఆర్సీని వ్యతిరేకిస్తూ కోల్​కతాలో భారీ ర్యాలీ చేపట్టారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆ రెండింటినీ తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకానివ్వమని ప్రతినబూనారు.

Mamata leads mega protest rally, vows not to allow NRC, citizenship law in Bengal
'పౌర' సెగ: బంగాల్​లో దీదీ భారీ 'నిరసన ర్యాలీ'

By

Published : Dec 16, 2019, 5:32 PM IST

పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ సోమవారం కోల్​కతాలో భారీ ప్రదర్శన చేపట్టారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రెండింటిని రాష్ట్రంలో అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. కోల్​కతా నగరంలో రెడ్ రోడ్ నుంచి 'జురాసాంకో ఠాగూర్ బారి' వరకు మమత నేతృత్వంలో సాగిన ర్యాలీలో వేలాది మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

'పౌర' సెగ

"ఎన్ఆర్సీ, 'పౌర' చట్టాన్ని ఎప్పటికీ బంగాల్​లో అనుమతించబోం. మేము అన్ని కులాలు, మతాలను విశ్వసిస్తాం. ఇక్కడ నివసించే వాళ్లందరూ దేశ పౌరులే. ఏ ఒక్కరు దేశాన్ని విడిచి వెళ్లరు."

- బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

బంగాల్​లో గత మూడు రోజులుగా ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నేడు స్వయంగా ముఖ్యమంత్రి నిరసనల్లో పాల్గొనడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​ ధంకర్ తప్పుబట్టారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details