తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు" - పశ్చిమ బంగ

పశ్చిమ బంగాలో తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా తీవ్ర విమర్శలు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపణ.

nirmala sitaraman

By

Published : Feb 4, 2019, 5:55 AM IST

పశ్చిమ బంగ తాజా పరిణామాల నేపథ్యంలో తృణముల్​ కాంగ్రెస్​పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కోల్​కతా పోలీస్​ కమిషనర్​ను ప్రశ్నించడానికి వచ్చిన సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకోవడం పరిపాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆరోపించింది.

"సీబీఐ దాని పని అది చేయాలా వద్దా? సీబీఐ తన పనిని అది చేస్తే రాజకీయ కుట్ర... చేయకపోతే పంజరంలో చిలక అని అంటారు. వారు జ్ఞానంతో ఆలోచించాలి. " - నిర్మలాసీతారామన్​, రక్షణ శాఖ మంత్రి

nirmalasitaraman

బెంగాల్​ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నేరుగా రాజ్యాంగ విధానాలపై దాడి చేయడమేనని భాజపా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అది ముఖ్యమంత్రి నియంతృత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు.

" కోల్​కతాలో తాజా పరిణామాలు, సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడం ఒక వింత, ఇంతవరకు ఎప్పుడూ జరగని విషయం. అది మమత బెనర్జీ నియంతృత్వ పోకడను ప్రతిబింబిస్తోంది. ఆమె దేని ద్వారా అయితే అధికారాన్ని పొందిందో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. "- జీవీఎల్​ నరసింహా రావు, భాజపా అధికార ప్రతినిధి

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ దర్యాప్తు చేపట్టిందని గుర్తుచేశారు నరసింహా రావు. నగర పోలీసుల చర్యలతో సర్వోన్నత న్యాయస్థానాన్ని అగౌరవపరిచారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details