వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 2006లో ఇదే రోజున కోల్‌కతాలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. #standwithfarmers అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
'వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడానికి వ్యతిరేకంగా సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 డిసెంబర్ 4న కోల్‌కతాలో నేను 26 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించా. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నా.''