జూనియర్ డాక్టర్ల సమ్మెపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు గంటల్లో సమ్మె విరమించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లపై పేషెంట్ బంధువుల దాడికి నిరసనగా సమ్మెను ప్రారంభించారు వైద్యులు. మూడు రోజులుగా కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేపడుతున్నారు.
జూడాల డిమాండ్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మమత తక్షణం ఆందోళన విరమించాలని ఆదేశించారు.