భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను దోచుకుని సొంత పార్టీకై వినియోగించారని ఆరోపించారు దీదీ. గతంలో పార్టీ కార్యకర్తలకు భోజనం పెట్టించడానికి డబ్బులు లేని వారు ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసే స్థితికి ఎలా చేరారని ప్రశ్నించారు.
"దస్త్రాల్ని కాపాడని వారు దేశాన్ని రక్షిస్తారా?'' - మమత బెనర్జీ
కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిష్టాత్మకమైన రఫేల్ పత్రాలనే కాపాడలేని వారు దేశాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విమర్శలు
" రఫేల్ పత్రాలనే కాపాడలేని వారు దేశాన్ని ఎలా రక్షిస్తారు. యుద్ధ విమానాల ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని మోదీ ప్రభుత్వం తెలిపింది. దేశంలోని నిధులను ఏమాత్రం మిగల్చకుండా మోదీ చోరీ చేశారు. మోదీప్రధాని పదవి నుంచిదిగగానే ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నారో దేశం మొత్తానికి తెలిసేలా చేస్తాం. "
- మమత బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
Last Updated : Mar 9, 2019, 9:14 AM IST