ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఫొని తుపాను నేపథ్యంలో మోదీ ఫోన్ కాల్స్ వ్యవహారంపై ఎట్టకేలకు స్పందిస్తూ... ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు దీదీ. కోల్కతాలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మోదీ సంప్రదించిన సమయంలో తాను ఖరగ్పూర్లో విపత్తు ప్రభావాన్ని సమీక్షిస్తున్నట్టు వివరించారు.
ఫొని తుపాను ప్రభావంపై చర్చించడానికి రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ మమత స్పందించలేదని ప్రధాని అన్నారు. చివరకు బంగాల్ గవర్నర్తో చర్చలు జరిపినట్టు తెలిపారు.
మమ్మల్ని పనివాళ్లు అనుకుంటున్నారా?