విజయ్ మాల్యాను అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. చట్టపరమైన చర్యల పూర్తి కోసమే వేచిచూస్తున్నామని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఈ పరిణామంపై అరుణ్‌జైట్లీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాల్యాను రప్పించటంలో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందని.. అదే సమయంలో ప్రతిపక్షాలు శారదా కుంభకోణం ... నిందితుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.