తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్​లాక్​ 1.0: ప్రార్థనామందిరాలు, మాల్స్​లో ఇవి తప్పనిసరి - hotels reopen news

లాక్​డౌన్ ఆంక్షలు సడలిస్తూ అన్​లాక్​ 1.oలో సోమవారం(జూన్ 8) నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రార్థనామందిరాలు, షాపింగ్​ మాల్స్​కు అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో వైరస్​ కట్టడికి పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అవేంటో తెలుసుకుందాం.

malls, restaurants & religious
రెస్టారెంట్లు, ప్రార్థనామందిరాల్లో పాటించాల్సిన నిబంధనలు ఇవే!

By

Published : Jun 8, 2020, 5:47 AM IST

Updated : Jun 8, 2020, 6:00 AM IST

దేశవ్యాప్తంగా సోమవారం (జూన్​ 8) నుంచి కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ అన్​లాక్​ 1.oను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్​, ప్రార్థన స్థలాలు, ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది కేంద్రం. 40 అంశాలతో సవివరమైన మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. అయితే.. ఒకవేళ ఇవి కట్టడి ప్రాంతాల్లో (కంటెయిన్‌మెంట్‌ జోన్లలో) ఉంటే మూసే ఉంచాలని ఆదేశించింది.

ప్రవర్తనలో మార్పే లక్ష్యం..

లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తూ.. అన్ని రకాల ఆర్థిక, సామాజిక కార్యకలాపాలకు అనుమతిస్తూ.. విడుదల చేసిన మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం ప్రజా ప్రవర్తనలో మార్పేనని పేర్కొంది కేంద్రం. మార్గదర్శకాలను అనుసరించి కరోనాను తరిమికొట్టాలని సూచించింది.

రెస్టారెంట్లు, ప్రార్థన మందిరాల్లో నిబంధనలు
రెస్టారెంట్లు, హోటళ్లలో నిబంధనలు
ప్రార్థన మందిరాల్లో నిబంధనలు
పని ప్రదేశాల్లో నిబంధనలు
Last Updated : Jun 8, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details