దేశవ్యాప్తంగా సోమవారం (జూన్ 8) నుంచి కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ అన్‌లాక్ 1.oను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది కేంద్రం. 40 అంశాలతో సవివరమైన మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో వీటిని తెరిచేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
అన్‌లాక్ 1.o: రెస్టారెంట్లు, మాల్స్‌లో నిబంధనలివే..
లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తూ అన్‌లాక్ 1.oలో సోమవారం(జూన్ 8) నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రార్థనామందిరాలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో వైరస్ కట్టడికి పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అవేంటో తెలుసుకుందాం.
రెస్టారెంట్లు, ప్రార్థనామందిరాల్లో పాటించాల్సిన నిబంధనలు ఇవే
ప్రవర్తనలో మార్పే లక్ష్యం..
లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తూ.. అన్ని రకాల ఆర్థిక, సామాజిక కార్యకలాపాలకు అనుమతిస్తూ.. విడుదల చేసిన మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం ప్రజా ప్రవర్తనలో మార్పేనని పేర్కొంది కేంద్రం. మార్గదర్శకాలను అనుసరించి కరోనాను తరిమికొట్టాలని సూచించింది.