జమ్ము కశ్మీర్ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించింది. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ మైదానంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ జెండా ఆవిష్కరించారు. పారామిలిటరీ దళం, జమ్ము కశ్మీర్ పోలీసులు చేసిన విన్యాసాలను తిలకించారు.
అనంతరం జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించారు.
"కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భయపడాల్సిన అవసరం లేదు. మీ గుర్తింపు గురించి ఎలాంటి ఆందోళన వద్దు. ఉగ్రవాదం, అసహనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సైనిక బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టిస్తాయి. ఉగ్రవాదం వైపు చూసే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాళ్లు రువ్వే ఘటనలు తగ్గాయి."
-సత్యపాల్ మాలిక్, కశ్మీర్ గవర్నర్