తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత సైన్యంలో విభేదాల సృష్టికి పాక్ కుట్ర' - india pak latest news

సైన్యంలో విభేదాలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని భారత ఆర్మీ ఆరోపించింది. కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని తెలిపింది. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.

pak india army
భారత్ పాక్

By

Published : Oct 1, 2020, 7:19 PM IST

భారత్​ను ప్రత్యక్షంగా ఎదుర్కోకోలేక సామాజిక మాధ్యమాల వేదికగా సైన్యంపై విషం చిమ్ముతోంది పాకిస్థాన్. మన సైన్యంపై కొన్ని రోజులుగా పాకిస్థాన్​ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని భారత్ ఆరోపించింది. పాక్​ స్పాన్సర్​ చేస్తోన్న సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఈ ప్రచారాన్ని సాగిస్తున్నట్లు స్పష్టం చేసింది భారత సైన్యం.

ముఖ్యంగా లెఫ్టినెంట్ జనరల్​ తరణ్​జిత్​ సింగ్​ లక్ష్యంగా పాక్​ ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. ఆయన ఇటీవలే సైనిక వ్యవహారాల శాఖలో సీనియర్ అధికారిగా నియమితులయ్యారు.

"కొన్నేళ్లుగా మతం ఆధారంగా దేశంలో చిచ్చు పెట్టేందుకు పాక్​ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా సైన్యంలో విభేదాలు సృష్టించాలని యత్నిస్తోంది" అని భారత్​ ఆరోపించింది. సైన్యాన్ని కించపరిచే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొడతామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి

ABOUT THE AUTHOR

...view details