బురదలో ఇరుక్కున్న ఆ ఏనుగు.. తనను తాను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేసింది. కొన్ని గంటల పోరాటం తర్వాత ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఏనుగు మృతికి గల కారణాలను పరిశీలించారు. తీవ్ర ఆకలితో మరణించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
బురదలో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన 'గజరాజు'
దేశంలో ఇటీవల ఏనుగులు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్న ఘటనలు పెరిగాయి. తాజాగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఓ ఏనుగు బురదలో చిక్కుకొని ప్రాణాలు విడిచింది.
బురదలో కూరుకుపోయి.. ప్రాణాలు విడిచిన గజరాజు
ఇటీవల అటవీ ఏనుగులు మృతి చెందుతున్న ఘటనలు పెరిగాయి. తాజాగా తమిళనాడు నీలగిరి అటవీ ప్రాంతంలో ఓ మగ ఏనుగు బురదలో కూరుకుపోయి మృతిచెందింది. శుక్రవారం రాత్రి గుడలూర్ సమీపంలోని కాఫీ తోటలోకి ప్రవేశించిన గజరాజు.. బురద గుంటలో పడిపోయింది. దాని రెండు వెనుక కాళ్లు సుమారు 5 అడుగుల లోతైన మట్టిలో కూరుకుపోవడం వల్ల పైకి లేవలేక.. అక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Last Updated : Jul 18, 2020, 1:40 PM IST