చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికులకు పశ్చిమ్ బంగాలో తయారైన తుపాకీలు(కార్బైన్) అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తుపాకులను సరఫరా చేయాలని ప్రతిపాదించింది. అయితే అక్కడ నుంచి తగినంతగా వచ్చే అవకాశాలు లేకపోవటంతో 'భారత్లో తయారీ'పై దృష్టి పెట్టింది.
చైనా సరిహద్దులకు బంగాల్ కార్బైన్లు - ishapur ordinance factory
సైనికులకు అందించే తుపాకులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తుపాకులను సరఫరా చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా బంగాలో తయారైన తుపాకీలు(కార్బైన్) అందజేయాలని భావిస్తోంది.
చైనా సరిహద్దులకు బెంగాల్ కార్బైన్లు
దీనిలో భాగంగా పశ్చిమ్ బంగాలోని ఇషాపూర్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారయ్యే తుపాకులను సరఫరా చేస్తే బాగుంటుందని నిర్ణయించింది. దాంతో వాటి సామర్థ్యాన్ని సంబంధిత అధికారులు పరీక్షించి చూశారు. మరిన్ని కఠిన పరీక్షలు చేసిన అనంతరం తయారీకి ఆర్డర్లు ఇవ్వనున్నారు. తొలుత తక్కువ మొత్తంలోనే సేకరించాలని నిర్ణయించారు. త్రివిధ దళాలకు మొత్తం 3.5లక్షల తుపాకులు అవసరం ఉంటుందని అంచనా.