తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాస్కులు, శానిటైజర్లపై జీఎస్టీ రద్దు చేయాలి'​ - Gandhi tweeted in Hindi about GST

కరోనాకు సంబంధించిన వస్తువులపై వస్తుసేవల పన్ను(జీఎస్టీ) రద్దు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఏ వస్తువులపై ఎంత మేర పన్ను వసూలు చేస్తుందో ట్వీట్ లో జత చేశారు రాహుల్.

Make all COVID-19 related equipment GST-free: Rahul Gandhi
'కరోనా వస్తువులపై తాత్కాలికంగా జీఎస్టీ తగ్గించాలి'

By

Published : Apr 20, 2020, 10:14 PM IST

Updated : Apr 20, 2020, 11:21 PM IST

కొవిడ్-19కు సంబంధించిన అన్ని వస్తువులపై జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లు, సబ్బులపై జీఎస్టీ వసూలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ట్వీట్ చేశారు.


జాబితాలో ఉన్నవి ఇవే!
ఏ ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ వసూలు చేస్తున్నారో జాబితా పొందుపరిచారు రాహుల్​.

ఆ జాబితా ప్రకారం... శానిటైజర్లు, హ్యాండ్ వాష్​లు, ఆసుపత్రిలో బల్లల వంటి ఫర్నిచర్లపై 18శాతం, రక్త పరీక్ష , మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ల మీద 12శాతం, వ్యాధి నిర్ధరణ కిట్లు, మాస్కులు, వ్యాక్సీన్లతో సహా పలు కీలక ఔషధాలపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని రాహుల్ తెలిపారు.

ఇదీ చూడండి:'లాక్​డౌన్'​ సేవకులందరికీ కృతజ్ఞతలు: రాష్ట్రపతి

Last Updated : Apr 20, 2020, 11:21 PM IST

ABOUT THE AUTHOR

...view details