భారత్‌లో పర్యటిస్తున్న అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దిల్లీలో చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగరేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
'గాలిపటం ఎగురవేయడానికి ఏ రోజైనా మంచిదే. భారత్‌కు ధన్యవాదాలు.' అనే కాప్షన్ ఈ వీడియోకు జతచేశారు.
చిన్ననాటి జ్ఞాపకాలు
మీరు జీవితంలో ఎప్పుడైనా గాలిపటం ఎగరేశారా? అని ఓ చిన్నారి బెజోస్‌ను ప్రశ్నించింది. దీనితో ఆయన తన బాల్యంలోకి వెళ్లిపోయారు.
బెజోస్ :నేను చిన్నతనంలో పతంగులు ఎగరేశాను. అయితే చాలా కాలం నుంచి గాలిపటాలు ఎగరేయలేదు. ఇప్పడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి.
మరో చిన్నారి : మీరు ఇప్పుడు ఆ సరదాలు మిస్ అవుతున్నారా?