బిహార్ పట్నా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. బిహ్తా నగరంలోని సాదిసోపుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు రెండుగా విడిపోయింది. కామాఖ్య నుంచి లోక్మాన్య తిలక్ వైపు వెళుతున్న క్రమంలో ఏడు బోగీలు ఇంజిన్ నుంచి వేరు కాగా... ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే రైలును నిలిపేశాడు.
రైలు ఆగాక చూస్తే... సగం బోగీలు ఇంజిన్‌కు కిలోమీటర్ దూరంలో నిలిచి ఉన్నాయి.
సమాచారం అందుకున్న ధనాపుర్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని.. బోగీలను కలిపారు. రెండు గంటల తర్వాత సేవలను పునరుద్ధరించారు. బోగీలు విడిపోయిన వెంటనే రైలును నిలిపివేయటం, వేగం తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.