కరోనా దెబ్బకు బిక్కుబిక్కుమంటూ లాక్డౌన్ జీవితం గడుపుతున్న ప్రజలను విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరింత ఆందోళనకు గురిచేసింది. అయితే.. గతంలోనూ ఇలాంటి సంఘటనలెన్నో జరిగాయి. అవేంటో ఓసారి చూడండి.
1984 డిసెంబర్ 2- భోపాల్ దుర్ఘటన.
1984 డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్‌లో.. 30 టన్నుల అత్యంత విషపూరితమైన వాయువు లీకైంది. మొత్తం 3,787 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యపై వేర్వేరు వాదనలు ఉన్నాయి. దాదాపు 16 వేల మందికిపైనే చనిపోయినట్లు సమాచారం.
2006 నవంబర్ 12
గుజరాత్ అంకలేశ్వర్‌లోని ఆయిల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు చనిపోయారు.
2010 జులై 16
బంగాల్లోని దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమలో విషపూరిత కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్ల 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
2011 ఆగస్టు 2
కర్ణాటక జిందాల్ ఉక్కు కర్మాగారంలోని ఓ కొలిమి నుంచి విషపూరిత వాయువు లీకై.. ముగ్గురు కార్మికుల్ని బలిగొంది.
2013 మార్చి 23
తమిళనాడు తూత్తుకుడిలోని ఓ కర్మాగారం నుంచి విషవాయువు(సల్ఫర్ డైఆక్సైడ్‌గా అనుమానం) లీకైంది. ఒకరు మరణించారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.
2014 జూన్ 5
తమిళనాడు తూత్తుకుడిలోని నైలా చేపల శుద్ధి కర్మాగారంలో.. గ్యాస్ పైప్‌లైన్ పేలి విషపూరిత అమోనియా వెలువడింది. ఈ ఘటనలో 54 మంది మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
2014 ఆగస్టు 7
కేరళలోని కొల్లంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ కర్మాగారం సమీపంలో 70 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ప్లాంట్ నుంచి వెలువడ్డ దట్టమైన పొగను పీల్చడమే కారణం.
2014 ఆగస్టు 27
బంగాల్లోని వర్ధమాన్‌లోని ఓ వెల్డింగ్ వర్క్‌షాప్‌లో సిలిండర్ నుంచి గ్యాస్ వెలువడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 50 మంది ఆరోగ్యంపైనా తీవ్రప్రభావం చూపింది.
2014 జులై 13