మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని విలే పార్లెలోని 13 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనంలోని ఏడు, ఎనిమిదో అంతస్థులో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
ముంబయి: 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం - mumbai fire accident news
మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబయిలోని 13 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది చివరకు మంటలను అదుపు చేసింది.
![ముంబయి: 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం Major fire in Mumbai building; many feared trapped: Officials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5461396-thumbnail-3x2-fire.jpg)
ముంబయిలోని 13 అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం
ముంబయిలోని 13 అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం
మంటలు చెలరేగినట్లు సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. 8-10 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. సాయంత్రం 7:10 గంటల సమయంలో ఈ ప్రమదం జరిగినట్లు తెలుస్తోంది.
Last Updated : Dec 22, 2019, 10:54 PM IST