తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎకే-47 బుల్లెట్లను తట్టుకునే హెల్మెట్​ను చూశారా..!​ - chepest gunshot locator in the world

ఏకే-47 తూటాలను తట్టుకోగలిగే బుల్లెట్​ ప్రూఫ్​ హెల్మెట్​ను కనుగొన్నారు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ ఆర్మీ మేజర్​. స్నైపర్ రైఫిల్​ తూటాలను తట్టుకునే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్​ను కూడా రూపొందించారు.

major-develops-bulletproof-helmet
ఎకే-47 బుల్లెట్లను తట్టుకునే హెల్మెట్​ను కనుగొన్న మేజర్​

By

Published : Feb 11, 2020, 6:30 AM IST

Updated : Feb 29, 2020, 10:37 PM IST

ఎకే-47 బుల్లెట్లను తట్టుకునే హెల్మెట్​ను చూశారా..!​

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆర్మీ మేజర్​ అనూప్​ మిశ్రా.. ఏకే-47 బుల్లెట్లను తట్టుకోగల బుల్లెట్​ ఫ్రూఫ్​ హెల్మెట్​ను కనుగొన్నారు. 10 మీటర్ల నుంచి బుల్లెట్​ ప్రయోగించినా ఇది ధరిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాదు స్నైపర్ రైఫిల్​ దాడులను ఎదుర్కొనే ఫుల్​ బాడీ బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్​ను కూడా రూపొందించారు మిశ్రా. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్​కు 'అభేద్య'గా నామకరణం చేశారు.

గన్​షాట్​ లొకేటర్​

ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గన్​షాట్​ లొకేటర్ పరికరాన్ని సైన్యం సంయుక్తంగా రూపొందించినట్లు చెప్పారు మిశ్రా. దీనిని లఖ్​నవూలో జరుగుతున్న డిఫెన్స్​ ఎక్స్​పో-2020 కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. పార్థ్​గా నామకరణం చేసిన ఈ పరికరం.. 400 మీటర్ల దూరంలోని శత్రువుల శరీరాలకు తూటాలను ఎక్కుపెట్టే కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి వేగంగా అంతమొందించగలదని పేర్కొన్నారు. ఈ పరికరం ఖరీదు రూ.3లక్షలు ఉంటుందన్నారు. దీనిని సైన్యంలో వినియోగించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన పరికరాలతో భర్తీ చేయవచ్చని మిశ్రా చెప్పారు. ప్రస్తుతం సైన్యం వినియోగిస్తున్న ఇలాంటి తరహా పరికరం ఖరీదు రూ. 65లక్షలుగా ఉందన్నారు.

ఇదీ చూడండి: బాణాలు వేయడంలో 'దేవసేన'ను మించిన నైపుణ్యం వీరిది!

Last Updated : Feb 29, 2020, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details