తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో​ ఉగ్రకుట్ర భగ్నం.. పేలుడు పదార్థాలు స్వాధీనం - కశ్మీర్​లో పేలుడు పదార్థాలు స్వాధీనం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశాయి భారత భద్రతా బలగాలు. పోలీసులు, రైఫిల్​ బృందం, సీఆర్పీఎఫ్​ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో భాగంగా.. అవంతిపొరాలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పేలుడు పదార్థాలు బయటపడటం గమనార్హం.

Major attack averted as forces recover explosives in South Kashmir
కశ్మీర్​లో​ ఉగ్ర కుట్ర భగ్నం

By

Published : Sep 17, 2020, 9:14 PM IST

Updated : Sep 17, 2020, 9:42 PM IST

జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరా జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. జిల్లా పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్​పీఎఫ్​ సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా.. ఈ పేలుడు పదార్థాలను గుర్తించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

కరేవా ప్రాంతంలోని ఓ గుంతలో పాతిపెట్టిన ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంక్‌లో మొత్తం 52 కేజీల పేలుడు పదార్థాలను గుర్తించారు అధికారులు. ఇందులో 125 గ్రాముల చొప్పున ఉన్న 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలున్నాయి. మరో గుంతలో దొరికిన ప్లాస్టిక్‌ ట్యాంక్‌లో 50 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది సైనిక బృందం.

భారత బలగాలు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు

పుల్వామా ఘటనకు సమీపంలోనే..

జాతీయ రహదారికి సమీపంలోనే ఈ పేలుడు పదార్థాలున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది పుల్వామాలో దాడి జరిగిన ప్రదేశానికి ఈ ప్రాంతం 9 కిలోమీటర్లే కావడం గమనార్హం. వీటిని గుర్తించడం ద్వారా మరో ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు అయ్యిందని ఓ సైనికాధికారి చెప్పారు.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన కారుతో ఓ ముష్కరుడు ఢీకొట్టాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై మన వాయుసేన బలగాలు దాడులు నిర్వహించాయి.

ఇదీ చదవండి:'ముంబయిలో రోజుకు 500 కిలోల డ్రగ్స్​ వినియోగం!'

Last Updated : Sep 17, 2020, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details