తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశాలకు ఆదివాసీల 'విప్పపువ్వు సారా'

ఛత్తీస్​గఢ్​ ఆదివాసీలు తయారు చేసే విప్పవువ్వు సారా ఇక అమెరికా, యూరప్​ సహా వివిధ దేశాలకు ఎగుమతి కానుంది. బస్తర్​ ప్రాంతంలోని ఆదివాసీలు వందల ఏళ్లుగా ఈ మద్యాన్ని తయారు చేస్తున్నారు. గోవాకు చెందిన డెస్మండ్​​ ఈ విప్పు పువ్వు సారాకు విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

By

Published : Mar 31, 2019, 7:01 AM IST

Updated : Mar 31, 2019, 3:03 PM IST

విదేశాలకు ఆదివాసీల 'విప్పపువ్వు సారా'

విదేశాలకు ఆదివాసీల 'విప్పపువ్వు సారా'
ఛత్తీస్​గఢ్​లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్​. ఈ ప్రాంతంలోని గిరిజనులు తరతరాలుగా విప్పపువ్వు సారాను తయారు చేస్తున్నారు. చాలా కాలంగా దీన్ని తక్కువ స్థాయి మద్యంగానే పరిగణిస్తున్నారు. కానీ కొద్ది కాలంగా ఈ సారాకు డిమాండ్​ పెరిగింది. ఖరీదైన పబ్బుల్లోనూ విప్పుపువ్వు సారాకు ఆదరణ పెరిగింది. అతిత్వరలో ఈ సారా అమెరికా, యూరప్​ తదితర దేశాలకూ ఎగుమతి కానుంది.

విప్పపువ్వు సారాను మాహువా అని పిలుస్తారు. ఈ విప్పపువ్వు సారాకు ప్రచారం కల్పించే దిశగా కృషి చేస్తున్నారు గోవాకు చెందిన డెస్మండ్​ నజరేత్​.

ఆంధ్రప్రదేశ్​లోని మద్యం డిస్టిలరీని మాహువాకు తీసుకురావాలని డెస్మండ్ ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక, గోవాల్లో ఉత్పత్తి అయిన మద్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు డెస్మండ్​కు అనుమతులు ఉన్నాయి. నాణ్యతతో కూడిన విప్పపువ్వు సారాను ఐరోపా దేశాలకూ ఎగుమతి చేయాలని యోచిస్తున్నారు డెస్మండ్. ఇప్పటివరకు తక్కువ ప్రమాణస్థాయిగా పరిగణిస్తున్న విప్పపువ్వు సారా ఈ నిర్ణయంతో ప్రీమియం మద్యం రేసులో ముందంజలో నిలిచే అవకాశం ఉంది.

అత్యుత్తమ మద్యంగా మాహువా

వందల ఏళ్లుగా గిరిజనులు విప్పపువ్వు సారా తయారు చేస్తున్నారు. కానీ మద్యం తయారు చేసే విధానాన్ని పరీక్షించని కారణంగా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటూ వస్తోంది. దీని దుష్ప్రభావం అనేక సార్లు బయటపడింది. సాంకేతికత ఉపయోగించడం ద్వారా ప్రమాదం తలెత్తని రీతిలో అత్యుత్తమ మద్యాన్ని తయారుచేయవచ్చు.

ఆదివాసీలకు దక్కని ధర

విప్పపువ్వు సారాను బస్తర్లో ఎక్కువగా తయారు చేస్తారు. అడవుల్లో తయారుచేసి పక్కనున్న మార్కెట్లలో విక్రయిస్తారు. ఒక కిలో సారాకు స్థానిక వ్యాపారులు రూ.10-12 రూపాయల చొప్పున మాత్రమే గిరిజనులకు చెల్లిస్తున్నారు. బయటి మార్కెట్లలో అదే మద్యాన్ని ఎక్కువ ధరకు వ్యాపారులు అమ్ముకుంటున్నారు.

ఆదివాసీల మేలుకు డెస్మండ్ ప్రయత్నాలు

ఆదివాసీల కృషికి సరైన ఫలితం దక్కే విధంగా కృషి చేస్తున్నారు డెస్మండ్. ఇకపై కిలో మద్యాన్ని రూ.40 నుంచి రూ.50ల వరకు కొనుగోలు చేస్తానని ఆదివాసీలకు హామీ ఇచ్చారు. ముడిసరుకైన విప్పపువ్వును ఎలా సేకరించాలో, సారాను ఎలా స్వచ్ఛమైన పద్ధతిలో తయారు చేయవచ్చో, గిరిజనులకు నేర్పిస్తామని చెప్పారు డెస్మండ్​. ఆయన నిర్ణయంతో ఆదివాసీలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరనుంది.

Last Updated : Mar 31, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details