తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్పీకర్​ పదవి కోసం 'మహా' పోరు - 'మహా' స్పీకర్​ పదవికి అధికార, విపక్షాల మధ్య పోటాపోటీ

మహారాష్ట్రలో స్పీకర్ పదవికి అధికార కూటమి మహా వికాస్​ అఘాడి, ప్రతిపక్ష భాజపా పోటాపోటీగా అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి.  కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేత నానా పటోల్, భాజపా అభ్యర్థిగా కిసాన్ కథోర్​లు బరిలో ఉన్నారు. నేడు మధ్యాహ్నం రెండు గటలకు బలపరీక్ష ఉండనుంది. రేపు స్పీకర్​ ఎన్నిక చేపట్టనున్నారు.

maharastra speaker election
'మహా' స్పీకర్​ పదవికి అధికార, విపక్షాల మధ్య పోటాపోటీ

By

Published : Nov 30, 2019, 12:39 PM IST

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ ప్రభుత్వం ఇవాళ బలపరీక్షకు సిద్ధమైన వేళ.. స్పీకర్‌ పదవికి పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. అధికార కూటమి తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. భాజపా కూడా బరిలో ఉంటామని సంకేతాలిచ్చింది.

కూటమి నుంచి నానా పటోల్​

శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ మహా వికాస్ అఘాడి కూటమి స్పీకర్ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోల్‌ స్పీకర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ తెలిపారు. ఈ మేరకు పటోల్​ నామినేషన్​ వేశారు. మహా వికాస్​ అఘాడిలో పదవుల పంపకాల్లో భాగంగా ఉపముఖ్యమంత్రి పదవీ ఎన్సీపీకి దక్కగా.. స్పీకర్ పదవీని చెపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది.

భాజపా అభ్యర్థిగా.. కిసాన్​ కాథోర్​

భాజపా కూడా స్పీకర్ అభ్యర్థిని ప్రకటించింది. కిసాన్ కాథోర్​ పేరును భాజపా స్పీకర్ అభ్యర్థిగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.

రేపు ఎన్నిక

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనున్నారు. రేపు స్పీకర్ ఎన్నిక జరుగనుంది.

ఇదీ చూడండి: నేడు ఉద్ధవ్​ సర్కార్​కు బలపరీక్ష.. గెలుపు లాంఛనమే..!

ABOUT THE AUTHOR

...view details