తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'పోరు: వారసుల కోసం శ్రమిస్తున్న తండ్రులు - మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ నేతల వారసులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈసారి మహానేతల వారసులు పోటీలో ఉన్నారు. తమ కుమారులు, కుమార్తెలను ఎలాగైనా గెలిపించుకోవాలని సర్వశక్తులు ధారపోస్తున్నారు తండ్రులు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రే, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిందే కుమార్తె ప్రణితి వంటి యువ వారసుల రాజకీయ భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

'మహా'పోరు: వారసుల కోసం శ్రమిస్తున్న తండ్రులు

By

Published : Oct 19, 2019, 6:31 AM IST

'మహా'పోరు: వారసుల కోసం శ్రమిస్తున్న తండ్రులు

వారసత్వం... రాజకీయాల్లో త్వరగా ఎదిగేందుకు ఉపకరించే ప్రధాన అస్త్రం. వారసత్వ రాజకీయాలకు దూరమని పార్టీలు పదేపదే చెప్పినా... ఎన్నికలు వచ్చే సరికి షరామామూలే. ఈనెల 21న శాసనసభ ఎన్నికలు జరిగే మహారాష్ట్రలోనూ దిగ్గజ నేతల వారసులు బరిలోకి దిగారు. వారిని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా తీరిక లేకుండా ప్రచారం సాగిస్తున్నారు తండ్రులు.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే తొలిసారి వారి కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. భాజపా ఎంపీ సునీల్​ తట్క​రే కుమార్తె అదితి తట్కరే, నారాయణ రాణే కుమారుడు నితేశ్ రాణే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిందే కుమార్తె ప్రణితి షిందే, రావ్​సాహెబ్ దాన్వే కొడుకు సంతోష్​ దాన్వే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

తొలిసారి ఠాక్రే వారసుడు

మరాఠాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ప్రముఖ కార్టూనిస్ట్ బాల్‌ఠాక్రే 1966లో శివసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి పలుమార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ పదవులను ఠాక్రే కుటుంబం పొందలేదు. అసలు... ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది కూడా లేదు. అలాంటిది తొలిసారి ఆ కుటుంబం నుంచి బాల్‌ ఠాక్రే మనుమడు, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబయిలోని వొర్లి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. కుమారుడి గెలుపు కోసం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. వొర్లి నియోజకవర్గంలో అనేక ర్యాలీల్లో పాల్గొన్నారు.

కొంకణ్​లో శ్రీవర్ధన్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ ఎంపీ సునిల్ తట్కరే కుమార్తె అదితి తట్కరే పోటీ చేస్తున్నారు. అదితి విజయం కోసం ఆమె కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్ శిందే కుమార్తె ప్రణితి శిందే.. సోలాపుర్ సిటీ సెంట్రల్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కుమార్తె విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు శిందే. సోలాపుర్​ అంతటా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో క్షేత్ర స్థాయిలో సమావేశాలు జరుపుతున్నారు.

భాజపా నేతల వారసుల జోరు

భాజపా నేత, కేంద్రమంత్రి రావ్​సాహెబ్ దాన్వే పుత్రుడు సంతోష్ దాన్వే.. జల్నా జిల్లాలోని భోకార్డన్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంపై దాన్వేకు ఉన్న పట్టుకు ఈ పోటీ... పరీక్షలా మారింది.

ఉత్తర మహారాష్ట్ర ముక్తాయినగర్​ స్థానం నుంచి భాజపా సీనియర్ నేత ఏక్​నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి ఖడ్సే బరిలో ఉన్నారు. కూతరు కోసం ఏక్​నాథ్ స్వయంగా నియోజకవర్గమంతా ప్రచారం నిర్వహిస్తున్నారు.

కణ్​కవ్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు నారాయణ్ రాణే కుమారుడు నితేశ్ రాణే. ఈయనపై పోటీగా శివసేన అభ్యర్థిని నిలిపింది. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్ఠగా తీసుకున్నారు నారాయణ్​. కొడకు గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

వారసుల్లో ఎవరు విజయ తీరాలకు చేరతారో ఈనెల 24న తేలనుంది.

ఇదీ చూడండి:అదరగొట్టిన రిలయన్స్​... క్యూ2లో 18% పెరిగిన లాభం

ABOUT THE AUTHOR

...view details