తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ న్యూస్​: ట్విస్టులే ట్విస్టులు... ఇప్పుడు ఎన్సీపీ వంతు

ఉత్కంఠగా సాగుతున్న 'మహా' రాజకీయాలు

By

Published : Nov 11, 2019, 10:26 AM IST

Updated : Nov 11, 2019, 10:31 PM IST

22:00 November 11

మహా ట్విస్ట్‌: ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి గవర్నర్‌ పిలుపు

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు ఇచ్చిన గడువు ముగిసిన కాసేపటికే... ఎన్నికల ఫలితాల్లో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీకి సమాచారమిచ్చారు. 24 గంటల గడువును నిర్దేశించారు. రేపు రాత్రి 8.30 గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్సీపీకి సమయముంది. 

తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా భాజపా (105)ను గవర్నర్‌ ఆహ్వానించగా.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఆ పార్టీ.. గవర్నర్‌కు తెలియజేసింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన (56)ను గవర్నర్‌ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు బలాన్ని, సమ్మతిని తెలియజేయాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మరింత గడువు కోరగా.. అందుకు తిరస్కరించారు.

మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీ (54)కి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఇవాళ రాత్రి సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (44), శివసేన సహకారం ఆ పార్టీకి తప్పనిసరి. మరి ఇప్పుడు ఎన్సీపీ ఏంచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

21:59 November 11

శివసేనకు 'కాంగ్రెస్' షాక్... వీడని 'మహా' ప్రతిష్టంభన

మహారాష్ట్రలో ప్రభుత్వ ప్రతిష్టంభన మరింత జటిలవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు గవర్నర్‌ను కలిసి వివరించిన శివసేన.. తమకున్న మద్దతు నిరూపించుకునేందుకు మరింత గడువు కోరింది. అందుకు గవర్నర్‌ నిరాకరించారు. నాటకీయ పరిణామాల మధ్య.. మరోసారి ఎన్సీపీతో చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడడం లేదు. కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వెలువడినప్పటికీ..అలా జరగలేదు. రోజంతా నాటకీయ పరిణామాల మధ్య శివసేనకు మద్దతిచ్చే విషయంపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదు. మరోసారి ఎన్సీపీతో చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు గవర్నర్‌ను కలిసి వివరించిన శివసేన తమకున్న మద్దతు నిరూపించుకునేందుకు మరింత గడువు కోరినట్లు తెలిపింది. అందుకు గవర్నర్‌ నిరాకరించినట్లు ఉద్ధవ్​ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. కాంగ్రెస్​, ఎన్సీపీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సేనకు మద్దతిచ్చేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ మౌనం

కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధంగా ఉండగా.... శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై హస్తం పార్టీ పెదవి విప్పటం లేదు. దీనిపై చర్చించేందుకు దిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ రెండుసార్లు సమావేశమైంది. శివసేనకు మద్దతిస్తే ఎన్సీపీతో కలిసి ప్రభుత్వంలో చేరాలా? లేకపోతే బయట నుంచి ఆ పార్టీకి మద్దతివ్వాలా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం.

ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో కాంగ్రెస్ అధిష్ఠానం రేపు మరోమారు సమావేశమై చర్చలు జరపాలని కాంగ్రెస్ సీనియర్​ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అంతకు ముందు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు.

భాజపా పరిశీలన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకై ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భాజపా నేత ముంగంటీవార్​ తెలిపారు.

గవర్నర్ నిర్ణయమే కీలకం

శివసేన ప్రతినిధుల బృందం తనను కలిసినట్లు గవర్నర్​ భగత్ సింగ్ కోశ్యారీ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 3 రోజుల గడువు కోరినట్లు చెప్పారు. ఇతర పార్టీల మద్దతు ఉన్నట్లు అధికారిక లేఖను సేన పొందుపరచలేదన్నారు. గడువు పొడిగించేందుకు నిరాకరించినట్లు పేర్కొన్నారు గవర్నర్.

20:45 November 11

ఎన్సీపీకి గవర్నర్​ నుంచి పిలుపు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన సరికొత్త మలుపు తిరుగుతోంది. శివసేనకు కాంగ్రెస్​-ఎన్సీపీల మద్దతుపై పూర్తి స్పష్టత లేని నేపథ్యంలో... ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది. గవర్నర్​ను.. శివసేన మరింత సమయం కోరగా.. అందుకు కోశ్యారీ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన తర్వాత.. అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీకి గవర్నర్​ నుంచి పిలుపు వచ్చింది. అయితే.. ఈ భేటీ ఎందుకా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరికాసేపట్లో అజిత్​ పవార్​ నేతృత్వంలోని ఎన్సీపీ బృందం రాజ్​భవన్​లో గవర్నర్​ను కలవనుంది . 

19:45 November 11

'2 రోజుల గడువు ఇవ్వలేదు'

గవర్నర్​ను కలిసిన అనంతరం శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం మరో 48 గంటల గడువు కోరామని.. అందుకు గవర్నర్​ నిరాకరించారని తెలిపారు. అయినా.. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. 

19:36 November 11

శివసేనకు కాంగ్రెస్​ మద్దతుపై అస్పష్టత

మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. శివసేనకు కాంగ్రెస్​ మద్దతిస్తుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే... మద్దత్తు లేదని.. ఇంకా చర్చలు జరుపుతామని కాంగ్రెస్​ తెలిపింది.

18:54 November 11

వీడిన ప్రతిష్టంభన!

  • మహారాష్ట్రలో కొలువుదీరనున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సర్కారు
  • శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వానికి బయట్నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం
  • మద్దతు లేఖను ఫ్యాక్స్ ద్వారా రాజ్‌భవన్‌కు పంపిన కాంగ్రెస్‌
  • పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత నిర్ణయం తీసుకున్న సోనియా
  • ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సోనియాగాంధీ
  • గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌ వెళ్లిన ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ నేతలు
  • శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు

18:41 November 11

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం!

  • మహారాష్ట్రలో కొలిక్కి వస్తున్న రాజకీయం
  • ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం
  • సుదీర్ఘ చర్చల తర్వాత నిర్ణయం తీసుకున్న సోనియా
  • ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సోనియా
  • శివసేన-ఎన్సీపీ ప్రభుత్వానికి బయట్నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం
  • గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌ వెళ్లిన శివసేన, ఎన్సీపీ నేతలు

18:28 November 11

గవర్నర్​ను కలవనున్న సేన నేతలు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన వీడేలా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేనను గవర్నర్​ ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆయనను కలిసేందుకు రాజ్​భవన్​కు బయల్దేరారు ఆ పార్టీ నేతలు ఏక్​నాథ్​ శిందే, ఆదిత్య ఠాక్రే. ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. 

17:18 November 11

ఫోన్​లో రాజకీయాలు

కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ- ఉద్ధవ్​ ఠాక్రే మధ్య ఫోన్​ సంభాష జరిగినట్టు సమాచారం. మహారాష్ట్ర పరిస్థితులపై శివసేన అధ్యక్షుడు సోనియాకు వివరించినట్టు తెలుస్తోంది. 

16:32 November 11

దిల్లీకి 'మహా' రాజకీయాలు

మహారాష్ట్ర కాంగ్రెస్​ సీనియర్​ నేతలు దిల్లీలోని టెన్​జన్​పథ్​కు చేరుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తున్నారు. శివసేనతో పొత్తుపై కాంగ్రెస్​ నిర్ణయం కోసం ఎన్​సీపీ ఎదురుచూస్తోంది. ఈ భేటీ అనంతరం మహా ప్రతిష్టంభనపై స్పష్టత వచ్చే అవకాశముంది.

15:44 November 11

సమవేశాలు, సంప్రదింపులు, చర్చలతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్​ భగత్​​ సింగ్​ కోషియారీ ఇచ్చిన అహ్వానం గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. శివసేన వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​తో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే భేటీ అయ్యారు. భాజపాతో తెగదెంపులు చేసుకున్న సేనకు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతివ్వాలని పవార్​కు కోరారు. ఇందుకు ఎన్​సీపీ అధినేత సానుకూలంగా స్పందించారు.

సుమారు 45 నిమిషాల పాటు సాగిన అగ్రనేతల భేటీలో... ప్రస్తుత రాజకీయా పరిణామాలు సహా కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ సమస్యలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. 

కాంగ్రెస్​ నిర్ణయం కోసం ఎదురుచూపులు...

శివసేనకు మద్దతిస్తున్నట్టు ఎన్​సీపీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ అంశంపై కాంగ్రెస్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు.. పార్టీ కోర్​ కమిటీ సమావేశం అనంతరం ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ తెలిపారు. ఎన్నికల్లో కలిసి బరిలో దిగామని, ఎలాంటి నిర్ణయమైనా కలిసే తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ చర్చోపచర్చలు...

దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.  సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్​ నేతలతో చర్చించి, తీసుకునే నిర్ణయంపై ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అధారపడి ఉంది.

ఎన్డీఏకు సేన గుడ్​బై!

భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్న శివసేన మరో అడుగు ముందుకేసింది. ఎన్డీఏకు దూరంగా జరుగుతున్నట్లు సంకేతాలిచ్చింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్రమంత్రి, శివసేన ఎంపీ అరవింద్​ సావంత్​ ప్రకటించారు. తొలుత 50-50 ఫార్ములాకు భాజపా అంగీకరించి.. ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు.
 

14:25 November 11

ఠాక్రే-పవార్​ కీలక భేటీ

శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్​సీపీ బాస్​ శరద్​ పవార్​ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించే దిశగా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.

13:22 November 11

ఉద్ధవ్​- పవార్​ మధ్య 'మహా' భేటీ

తాజా రాజకీయ పరిణామాల మధ్య ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​తో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అగ్రనేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం శివసేన-కాంగ్రెస్​-ఎన్​సీపీ పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని మూడు పార్టీల వర్గాలు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

12:36 November 11

ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్​సీపీ

మహారాష్ట్రలో ఎన్​సీపీ కోర్​ కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనపై కాంగ్రెస్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ తెలిపారు. శివసేనకు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న మాలిక్​... తుది నిర్ణయం హస్తం పార్టీ హైకమాండ్​దేనని వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్​-ఎన్​సీపీ కలిసి బరిలో దిగిందని... ఇప్పుడు కూడా ఏ నిర్ణయాన్నైనా కలిసే తీసుకుంటామని స్పష్టం చేశారు మాలిక్​.

12:21 November 11

4 గంటలకు మహా కాంగ్రెస్​ నేతల భేటీ

దిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. మహారాష్ట్ర కాంగ్రెస్​ నేతలతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు భేటీ జరగనుందని సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇందులో తదుపరి కార్యచరణపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు నేతలను దిల్లీకి పిలిపించినట్టు స్పష్టం చేశారు.

11:10 November 11

భాజపాది అహంకారం: శివసేన నేత సంజయ్‌ రౌత్‌

భాజపా పై తీవ్ర విమర్శలు చేశారు శివసేన సీనియర్‌ నేత సంజయ్‌రౌత్‌.  జమ్ముకశ్మీర్‌లో భాజపా పీడీపీ జతకట్టినప్పుడు... తాము ఎన్​సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

‘భాజపాది అహంకారం. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించి అతిపెద్ద పార్టీగా గెలిపించిన మహారాష్ట్ర ప్రజలను అవమానించింది. వారు(భాజపాను ఉద్దేశించి) ప్రతిపక్షంలో కూర్చోడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ.. ఎన్నికల ముందు ఒప్పుకున్న ‘చెరిసగం’ పాలనకు మాత్రం అంగీకరించలేదు. మాతో చర్చలకు భాజపా సిద్ధంగా లేనప్పుడు రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. భాజపా-శివసేన మధ్య బంధం ఉందని మేం అనుకోవట్లేదు’ అని సంజయ్‌ రౌత్‌ చెప్పుకొచ్చారు.

11:04 November 11

కాసేపట్లో భాజపా కోర్​ కమిటీ సమావేశం

  • కాసేపట్లో ముంబయిలో భాజపా రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం.
  • ముంబయిలోని  వర్షా బంగ్లాలో సమావేశంకానున్న కోర్‌కమిటీ సభ్యులు.
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ.

10:55 November 11

భవిష్యత్తు ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయగలమా: నిరుపమ్​

  • శివసేన ప్రభుత్వంలో భాగస్వామ్యంపై ఎవరితో చర్చలు జరగలేదు: ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌
  • వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు తీవ్రమైన విషయం: ప్రఫుల్‌ పటేల్‌
  • క్షుణ్ణంగా పరిశీలించి మా నిర్ణయం ప్రకటిస్తాం: ప్రఫుల్‌ పటేల్‌

10:38 November 11

శివసేనతో భాగస్వామ్యంపై చర్చలు జరగలేదు: ప్రఫుల్​ పటేల్​

  • భాజపా వెనక్కితగ్గడం మహారాష్ట్ర ప్రజలను అవమానపరచడమే: సంజయ్‌రౌత్‌
  • ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధపడ్డారు.. 50-50 సూత్రం మాత్రం అనుసరించరు: సంజయ్‌రౌత్‌
  • ఎన్నికలకు ముందు అంగీకరించారు.. తర్వాత వెనక్కి తగ్గారు: సంజయ్‌రౌత్‌
  • ముఖ్యమంత్రి పదవి శివసేనదే: సంజయ్‌రౌత్‌
  • ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాం: సంజయ్‌రౌత్‌

10:34 November 11

ముఖ్యమంత్రి పదవి శివసేనదే: సంజయ్‌రౌత్‌

మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిణామాలు, శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు,  చర్చించేందుకు నేడు దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం కానుంది. దిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో అహ్మద్​ పటేల్​, కేసీ వేణుగోపాల్​, మల్లికార్జున్​ ఖర్గే సహా ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

10:34 November 11

మహారాష్ట్ర పరిణామాలపై నేడు సీడబ్ల్యూసీ భేటీ

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, శివసేన ఎంపీ అరవింద్​ సావంత్​ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ స్పందించారు. ఎవరి రాజీనామాలపై తాను మాట్లాడాలనుకోవట్లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్​తో నేడు సమావేశం కానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్​తో చర్చల తదుపరి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

10:26 November 11

కాంగ్రెస్​తో చర్చల అనంతరం తుది నిర్ణయం: ఎన్​సీపీ

శరద్​ పవార్​, ఎన్​సీపీ అధినేత

కేంద్ర మంత్రి పదవికి అరవింద్​ సావంత్​ రాజీనామా!


మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్​సింగ్​ కోషియారీ.. శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్​ సావంత్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ముందుగా ఎన్డీఏ కూటమి నుంచి ఆ పార్టీ తప్పుకోవాలని స్పష్టం చేసింది ఎన్సీపీ. ఈ క్రమంలో అరవింద్​ సావంత్​ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్సీపీ నేతల వ్యాఖ్యల అనంతరం అరవింద్​ సావంత్​ మాట్లాడుతూ.. పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ఆదేశిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆదివారమే ప్రకటించారు అరవింద్​. 

10:12 November 11

లైవ్​ న్యూస్​: ట్విస్టులే ట్విస్టులు... ఇప్పుడు ఎన్సీపీ వంతు

కేంద్ర మంత్రి పదవికి అరవింద్​ సావంత్​ రాజీనామా!


మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్​సింగ్​ కోషియారీ.. శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్​ సావంత్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ముందుగా ఎన్డీఏ కూటమి నుంచి ఆ పార్టీ తప్పుకోవాలని స్పష్టం చేసింది ఎన్సీపీ. ఈ క్రమంలో అరవింద్​ సావంత్​ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్సీపీ నేతల వ్యాఖ్యల అనంతరం అరవింద్​ సావంత్​ మాట్లాడుతూ.. పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ఆదేశిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆదివారమే ప్రకటించారు అరవింద్​. 

Last Updated : Nov 11, 2019, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details