తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మర్కజ్​ గ్యాంగ్​' ఆచూకీ చెప్పిన వ్యక్తిపై మూకదాడి

దిల్లీ నిజాముద్దీన్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ఆచూకీ చెప్పిన ఓ వ్యక్తిపై మహారాష్ట్ర సోలాపుర్​లో మూకదాడి జరిగింది. మరోవైపు కోల్​కతా నుంచి యూపీలోని స్వగ్రామానికి చేరుకున్న ఓ జవాన్​... తన పేరును గ్రామ పంచాయతీ జాబితాలో చేర్పించారనే కోపంతో ఓ మహిళను తుపాకీతో కాల్చిచంపాడు.

Man assaulted for 'leaking' info on Tablighi meet attendees
తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గన్న వారి ఆచూకీ చెప్పిన వ్యక్తిపై దాడి

By

Published : Apr 2, 2020, 3:52 PM IST

దిల్లీ నిజాముద్దీన్​లో తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారి గురించి గ్రామాధికారికి సమాచారం అందించాడనే కోపంతో ఓ వ్యక్తిపై కొందరు దుండగలు దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్ర సోలాపుర్​లో జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

వైరాగ్​ పోలీసులు కథనం ప్రకారం... మర్కజ్​ నుంచి తిరిగి స్వస్థలానికి వచ్చిన ఏడుగురు వ్యక్తుల గురించి ఓ పెద్దాయన 'గ్రామసేవక్​'కు సమాచారం అందించాడు. వారందరికీ కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరాడు. తమ విషయాన్ని బయట పెట్టాడనే కోపంతో ఆ దుండగులు అంతా కలిసి పెద్దాయనపై దాడి చేశారు.

మహిళను చంపేసిన జవాన్

ఉత్తర్​ప్రదేశ్​ అలీపుర్​లో దారుణం జరిగింది. ఇటీవలే కోల్​కతా నుంచి స్వగ్రామానికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్... స్థానిక​ మహిళను తుపాకీతో కాల్చిచంపేశాడు.

కరోనా వైరస్ ప్రబలతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వ్యక్తుల జాబితా రూపొందించాలని అలీపుర్​ అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ బాధ్యతను వినయ్​ యాదవ్​ అనే వ్యక్తికి అప్పగించింది. వినయ్... ఇటీవలే కోల్​కతా నుంచి గ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్ శైలేంద్ర సహా అతడి కుటుంబ సభ్యుల పేర్లను​ జాబితాలో చేర్చాడు.

తమ పేర్లు జాబితాలో చేర్చాడనే కోపంతో శైలేంద్ర, మరో ముగ్గురు... వినయ్​ యాదవ్​ ఇంటిలోకి చొరబడి, దాడి చేశారు. వినయ్​ను రక్షించడానికి అతడి సోదరుడు దినేశ్​, వదిన సంధ్య ప్రయత్నించారు. కోపంతో ఊగిపోయిన శైలేంద్ర తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:సర్కార్​ 'లిక్కర్​ పాసుల' నిర్ణయంపై హైకోర్టు స్టే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details