మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరుకు రెండు రోజుల ముందు నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. అక్రమ నగదు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోలాపుర్ జిల్లా మోహోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ కదమ్ అరెస్టయ్యారు. ఆయన వద్ద నుంచి రూ.53.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఈసీ అధికారులు.
ఠాణె జిల్లా ఘోద్బందర్లోని ఓ అపార్ట్మెంట్లో అక్రమ నగదు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఎన్నికల సంఘం, ఠాణె పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
"ఎన్నికల సంఘం బృందంతో పాటు ఠాణె పోలీసులు ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రమేశ్ కదమ్, ఫ్లాట్ యజమాని రాజు గ్యాను ఖేర్ ఉన్నట్లు గుర్తించారు. ఫ్లాట్‌లో రూ.53.46 లక్షల రూపాయలు లభించాయి. ఫ్లాట్‌ను సీజ్ చేశాం"