మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 9తో ముగియనున్న వేళ.. రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భాజపా-శివసేన మధ్య నెలకొన్న విభేదాలు కొలిక్కి రాక ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు రోజుల్లో అధికార కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 9లోపే నూతన ప్రభుత్వ కొలువుదీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. భాగస్వామ్య పార్టీ శివసేనతో సంప్రదింపులు పూర్తయినట్లేనని పేర్కొన్నాయి.
గవర్నర్తో భేటీ..
ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని నేడు కలవనుంది భాజపా ప్రతినిధుల బృందం. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వీరికి నేతృత్వం వహించనున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపిన సందేశాన్ని గవర్నర్కు చేరవేయనున్నట్లు తెలిపారు భాజపా నేత, రాష్ట్ర మంత్రి ముంగంటివార్. గవర్నర్తో భేటీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
పార్టీ నేతలో ఠాక్రే సమావేశం..