మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందిని నియమించింది ఈసీ. వీరు 269 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు అధికారులు.
మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలు ఉండగా..3 వేల 237 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 8 కోట్ల 98 లక్షల మంది ఓటర్లరో 61.13 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
288 అసెంబ్లీ స్థానాలతో పాటు సాతారా లోక్‌సభ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఎన్సీపీ ఎంపీ ఉదయ్నరాజే ఆ పార్టీకీ రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక నిర్వహించారు. ఉదయ్ నారాజే ఈసారి భాజపా నుంచి పోటీ చేశారు.