మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. భాజపా-శివసేన కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఊహించినదానికన్నా ఎక్కువ స్థానాల్లో జోరు కనబరుస్తోంది. తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ.. - maharastra election news
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార పక్షం ఆధిక్యం కనబరుస్తోంది. అయితే... విపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి జోరు కనబరుస్తోంది.
'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..
శాసనసభ ఎన్నికలు ఈనెల 21న ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ భాజపాకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. కానీ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ తేల్చినంత ఏకపక్షంగా ఫలితాలు ఉండబోవనేది స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి: రిజల్ట్స్ లైవ్ : రెండు రాష్ట్రాల్లోనూ భాజపా ముందంజ