తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పీతల వల్లే తివారె ఆనకట్ట​కు గండి' - Ratnagiri

మహారాష్ట్రలోని తివారె డ్యామ్​కు గండి పడటానికి పీతలే కారణమని చెప్పారు ఆ రాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి. ఆనకట్టలో పెద్ద సంఖ్యలో పీతలున్నట్లు స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారని... చర్యలు తీసుకునేలోపే ప్రమాదం జరిగిందన్నారు. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కు చేరింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

'పీతల వల్లే తివారె ఆనకట్ట​కు గండి పడింది'

By

Published : Jul 5, 2019, 10:37 AM IST

మహారాష్ట్రలోని రత్నగిరిలో ఆనకట్ట కూలిపోయిన ఘటనకు పీతలే కారణమన్నారు ఆ రాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ . తివారె డ్యామ్​లో పెద్ద సంఖ్యలో పీతలు చేరినందునే ఆనకట్టకు గండి పడిందని చెప్పారు. స్థానికులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని.. నీటి పారుదల విభాగం చర్యలు తీసుకునే లోపే ఘటన జరిగిందని సావంత్ తెలిపారు.

మంగళవారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 19మంది మరణించినట్లు అధికారులు నిర్ధరించారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

డ్యామ్​ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రత్నగిరిని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మహారాష్ట్ర నీటిపారుదల మంత్రి గిరీష్‌ మహాజన్‌ను ఆదేశించారు ఫడణవీస్.

ABOUT THE AUTHOR

...view details