మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి 'జైలు పర్యాటకం' ప్రారంభించేందుకు సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. బ్రిటిష్ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్, పటేల్, నేతాజీ వంటి జాతి నేతలెందరినో ఎరవాడ జైలులో నిర్బంధించారు. వారి గుర్తులెన్నో అక్కడ నేటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకులు వాటినిప్పుడు చూసే అవకాశం వచ్చింది.
జైలు పర్యాటకంతో కసబ్ ఉరికంబాన్ని వీక్షించొచ్చు - maharashtra home minsiter about jail tourism in maharashtra
జనవరి 26 నుంచి మహారాష్ట్రలో 'జైలు పర్యాటకం' కార్యక్రమం ప్రారంభం కానుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలును ఈ కార్యక్రమంలో భాగంగా సందర్శకులు చూడొచ్చు.
కసబ్ ఉరికంబాన్ని వీక్షించే అవకాశం
ముంబయిలో 26/11 దాడుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు. ఎరవాడ జైలుతో పాటు ఠాణె, నాసిక్, రత్నగిరి జైళ్లలోనూ ఈ తరహా పర్యాటకం ఉంటుందని హోం మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:పాల్ దినకరన్ ఇంట్లో 5 కిలోల బంగారు కడ్డీలు
Last Updated : Jan 24, 2021, 10:18 AM IST