తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ప్రభావంతో షిరిడీ ఆలయం మూసివేత - maharashtra news

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులు దర్శనానికి రాకూడదని తెలిపారు.

maharashtra-shirdi-temple-closed
కరోనా ప్రభావంతో షిరిడీ ఆలయం మూసివేత

By

Published : Mar 17, 2020, 12:58 PM IST

కరోనా వైరస్‌ ప్రభావంతో మహారాష్ట్రలో షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు.

దేశంలో ఇప్పటికే 125కిపైగా కరోనా కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఇప్పటికే 39 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. అత్యధిక రద్దీ ప్రాంతాలు, ఆలయాల్లో కూడా ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంబయిలో ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయం సహా మరికొన్ని ఆలయాలను మూసివేశారు.

ఇదీ చూడండి: చికిత్స చేసిన డాక్టర్​కే కరోనా నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details