దేశంలోనే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 9,431 మంది వైరస్ బారినపడ్డారు. మరో 267 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,75,799కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 13,656మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,601గా ఉంది.
తమిళనాడులో..
దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో మరో 6,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 85మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,13,723కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 3,494కి చేరింది.
కర్ణాటకలో