మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 6 వేల 603 మందికి వైరస్ సోకింది. మరో 198 మంది బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 2 లక్షల 23 వేలు దాటాయి. మరణాల సంఖ్య 10 వేలకు చేరువైంది.
మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 198 మంది మృతి - covid in india
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇవాళ 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో 198 మంది మరణించారు. ఇతర రాష్ట్రాల్లోనూ బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.
మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 198 మంది మృతి
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. హోటళ్లు తెరుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రానున్న రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా.. రెస్టారెంట్లు, జిమ్‌లు కూడా ప్రారంభించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే.
- మధ్యప్రదేశ్‌లో మరో 409 మంది వైరస్ బారినపడ్డారు. మరో ఏడుగురు చనిపోయారు.
- పంజాబ్‌లో ఇవాళ 158 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 178గా ఉంది.
- గుజరాత్లో ఒక్కరోజు 700 మందికిపైగా కరోనా సోకింది.
- బంగాల్లో 986 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 23 మరణాలు సంభవించాయి.