దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు, భౌతిక దూరం నిబంధనల్ని కట్టుదిట్టం చేసింది కేంద్రం. అయితే.. వీటిని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు సన్నద్ధమైంది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా యంత్రాంగం. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని వినూత్నంగా శిక్షిస్తున్నారు అక్కడి అధికారులు. జాగ్రత్తలు పాటించని వారిని ఓపెన్ జైలుకు పంపి, కరోనాపై వ్యాసం రాయిస్తున్నారు.
కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే వ్యాసం రాయాల్సిందే..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో కరోనాపై వ్యాసం రాయిస్తున్నారు అక్కడి అధికారులు.
అక్కడ కరోనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే వ్యాసం రాయాల్సిందే..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 'రోకో-టోకో' కార్యక్రమాన్ని చేపట్టింది జిల్లా యంత్రాంగం. వైరస్‌పై అవగాహన కల్పించడం సహా.. కొవిడ్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయడమే దీని ఉద్దేశం. అందులో భాగంగా ఈ నెల 5న(శనివారం) మాస్కులు లేకుండా కనిపించిన 20మందిని జిల్లాలోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంకు(ఓపెన్ జైలు)కు తరలించారు. అనంతరం వారితో కొవిడ్-19పై వ్యాసం రాయించారు.