తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడే 'మహా' మంత్రివర్గ విస్తరణ.. అజిత్​ పవార్​కు డిప్యూటీ!

మహారాష్ట్రలో అధికారం చేపట్టిన ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం నేడు మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. ఇప్పటికే మూడు పార్టీలకు తలో రెండు పదవులు కేటాయించిన సీఎం.. నేటి భేటీలో మరి కొంత మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు ఉన్నాయి.

Maharashtra ministerial expansion today
నేడే మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

By

Published : Dec 30, 2019, 5:05 AM IST

అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్రలో అధికారం చేపట్టింది కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన పార్టీల కూటమి 'మహా వికాస్​ అఘాడీ'. నెల రోజుల అనంతరం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. మొత్తం 36 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన జాబితా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో అజిత్​ పవార్​, నవాబ్​ మాలిక్​, ధనంజయ్​ ముండే, అదితి తట్​కరే, రాజేశ్​ టోపే​ ఉన్నట్లు సమాచారం.

డిప్యూటీగా.. అజిత్​ పవార్​!

ప్రమాణ స్వీకారం సమయంలో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేత అజిత్​ పవార్​ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కానీ.. అలా జరగలేదు. కాంగ్రెస్​కు స్పీకర్​, ఎన్​సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఒప్పందం నేపథ్యంలో ఆ పదవిని అజిత్​ పవార్​ చేపడతారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కాంగ్రెస్​ శ్రేణుల్లో అసంతృప్తి..

మంత్రివర్గ విస్తరణలో భాగంగా కేటాయించే శాఖలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్​ శ్రేణులు. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని శాఖలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారని హైకమాండ్​కు ఏకరువు పెట్టుకున్నారు. పశు సంవర్ధక, జౌళి శాఖలను కేటాయింటే అవకాశం ఉందని.. వాటిని వ్యవసాయ, పరిశ్రమల శాఖల్లో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు. మంత్రులు, సహాయ మంత్రుల పదవుల పంపకాల్లో సమతుల్యత లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్​ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

ఒప్పందం ప్రకారం..

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అధికారం చేపట్టే క్రమంలోనే పదవుల పంపకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే శివసేనకు కేబినెట్‌లో 16 బెర్తులు, ఎన్​సీపీకి 15, కాంగ్రెస్‌కు స్పీకర్​ సహా 13 మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్‌కు దక్కే 13 బెర్తుల్లో 9 కేబినెట్‌, 4 సహాయ మంత్రి పదవులు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రేతో పాటు 3 పార్టీలకు చెందిన ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో శివసేన నుంచి ఏక్​నాథ్ శిందే, సుభాష్ దేశాయి.. ఎన్సీపీ నుంచి ఛగన్​ భుజ్​బల్​, జయంత్ పాటిల్.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్​, నితిన్​ రౌత్​ ఉన్నారు.

ఇదీ చూడండి: ప్రియాంక కూర్చొన్న స్కూటీ ఓనర్​కు రూ.6300 ఫైన్​!

ABOUT THE AUTHOR

...view details