మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా కరోనా బాధితుల జాబితాలోకి చేరుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
"కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కానీ నాకు ఎటువంటి వైరస్ లక్షణాలు లేవు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాను. గత కొద్ది రోజుల నుంచి నన్ను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను."
-అస్లాం షేక్, మహారాష్ట్ర టెక్స్టైల్ మంత్రి.
సదరు మంత్రి ముంబయి పశ్చిమ మాలాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కొద్దిరోజులు.. ముంబయిలో తన నివాసం నుంచే విధులను నిర్వర్తించనున్నారు అస్లాం షేక్.