బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంలో మహారాష్ట్ర హోంమంత్రికి అనిల్ దేశ్‌ముఖ్‌కు మరోమారు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రెండు సార్లు ఫోన్ చేసి బెదిరింపునకు పాల్పడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
''హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వేరు వేరు వ్యక్తుల నుంచి మంగళవారం, బుధవారం ఉదయం 6 గంటలకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.''
- దేశ్‌ముఖ్ సన్నిహిత వర్గాలు