తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోమారు భాజపానే.. ఎగ్జిట్​పోల్స్​ అంచనా..! - HARIYANA ASSEMBLY ELECTIONS RESULTS

లైవ్​ అప్​డేట్స్​ : మరికాసేపట్లో మహారాష్ట్ర, హరియాణా పోలింగ్​

By

Published : Oct 21, 2019, 6:44 AM IST

Updated : Oct 21, 2019, 7:30 PM IST

19:10 October 21

హరియాణాలో ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు.. విజయావకాశాలు ఎవరికి..!

హరియాణాలో ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు మరోమారు భాజపాకే అధికారం కట్టబెట్టాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 46 స్థానాల కంటే... దాదాపు 30 సీట్లు భాజపా అధికంగా గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి మనోహర్​లాల్​ ఖట్టర్​ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముంది. ఎగ్జిట్​ పోల్స్​ ప్రకారం... కాంగ్రెస్​కు 20 స్థానాలు కూడా రావని తెలుస్తోంది. 

ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు..

సర్వే సంస్థ భాజపా కాంగ్రెస్​ ఇతరులు
టైమ్స్​ నౌ 71 11 8
జన్​ కీ బాత్​ 57 17 16
న్యూస్​ ఎక్స్​ 77 11 2
పోల్​ ఆఫ్​ పోల్స్​ 63 16 11

19:01 October 21

మహారాష్ట్రలో ఎగ్జిట్​ పోల్స్​ ఎవరెలా..?

మహారాష్ట్రలో మరోసారి ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​పోల్స్​ అంచనా వేశాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి 145 అవసరం కాగా... 230 సీట్లకు మించి అధికార కూటమి గెలుస్తుందని అభిప్రాయపడ్డాయి. 

ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు...

సర్వే సంస్థ భాజపా-శివసేన కాంగ్రెస్​-ఎన్సీపీ ఇతరులు
టైమ్స్​ నౌ 230 48 10
ఇండియా టుడే-మై యాక్సిస్​ 181 81 26
న్యూస్​ 18-IPSOS 243 41 4
ఏబీపీ సీ-ఓటర్​ 204 69 15
జన్​ కీ బాత్​  223 54 11
పోల్​ ఆఫ్​ పోల్స్​ 213 61 14

19:01 October 21

భాజపాకే ఆధిక్యం..!

మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యంతో భాజపానే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనావేసింది ఇండియా టుడే- యాక్సిస్ మై ​ఇండియా సర్వే. భాజపా-శివసేన 166-194 స్థానాల మధ్య, కాంగ్రెస్​ -ఎన్సీపీ 72-90 మధ్య స్థానాలు వస్తాయని తెలిపింది. 

18:45 October 21

భాజపానే అధికారంలోకి వస్తుందన్న ఇండియా టుడే ..!

90 స్థానాలున్న హరియాణాలో మరోసారి భాజపా అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది న్యూస్​ 18-ఐపీఎస్​ఓఎస్​ సర్వే. భాజపాకు ఏకంగా 75 స్థానాలు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్​ 10, జేజేపీ 2, ఇతరులు 3 స్థానాలకు మాత్రమే పరిమితమవుతాయని చెప్పింది. 

18:45 October 21

హరియాణాలోనూ భాజపానే...!

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలపై ఎగ్జిట్​పోల్స్​ అంచనాలు విడుదల చేశాయి. మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్డీఏనే తిరిగి అధికారంలోకి వస్తాయని తెలిపాయి. న్యూస్​ 18-ఐపీఎస్​ఓఎస్​ సర్వే.. భాజపా-శివసేన కూటమికి 243 పైచిలుకు స్థానాలు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్​-ఎన్సీపీలకు 40 స్థానాల వరకే దక్కొచ్చని పేర్కొంది. 

18:36 October 21

హరియాణాలో తిరుగులేని భాజపా..!

రాజకీయ కురుక్షేత్రం హరియాణాలో శాసనసభ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు, రాజకీయ ప్రముఖులు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చారు. 90 స్థానాల్లో పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అక్టోబర్​ 24న ఫలితాలు వెల్లడించనున్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని భాజపా, కాంగ్రెస్​ ధీమాగా ఉన్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఖట్టర్​ సైకిల్​పై పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ సీఎం భూపిందర్​ సింగ్​ హుడా రోహ్​తక్​లో ఓటు వేశారు. ఇతర క్రీడా ప్రముఖులు, ఎన్నికల బరిలో నిలిచిన భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్​ సింగ్​, రెజ్లర్​, ఒలింపిక్​ పతక విజేత యోగేశ్వర్​ దత్​, బబితా ఫొగాట్​లు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ​  

18:29 October 21

ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకే పట్టం..!

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాంద్రా, అంధేరీలోని బాలీవుడ్​ తారలు... తమ తమ పోలింగ్​ బూత్​లలో ఓటేశారు. ఓటర్లు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు ప్రముఖ నటీనటులు. గెలుపుపై భాజపా-శివసేన, కాంగ్రెస్​-ఎన్సీపీ కూటములు ధీమాగా ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ 63 శాతం పోలింగ్​ నమోదైంది. 

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల ముందు బారులు తీరారు. ముంబయిలో పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్​ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. 

18:09 October 21

రాజకీయ కురుక్షేత్రాన ముగిసిన పోలింగ్​

హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. మహారాష్ట్రలో 2014తో పోలిస్తే ఓటింగ్​ శాతం తగ్గినట్లు కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ 63 శాతం పోలింగ్​ నమోదైంది.

హరియాణాలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల ముందు బారులు తీరారు. గెలుపుపై భాజపా, కాంగ్రెస్​ తమకు తామే ధీమాగా ఉన్నాయి. 

18:06 October 21

మహారాష్ట్రలో పోలింగ్​ ప్రశాంతం

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​... బాంద్రా(పశ్చిమ) నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

18:02 October 21

హరియాణా, మహారాష్ట్రల్లో ముగిసిన పోలింగ్​

మధ్యాహ్నం 3.30 గంటల వరకు హరియాణాలో రికార్డు స్థాయిలో 50.59 శాతం పోలింగ్​ నమోదైంది. 

మహారాష్ట్రలో మధ్యాహం 3 గంటల వరకు 43.78 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

17:00 October 21

సల్మాన్​ ఖాన్​ ఓటు వినియోగం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.... ప్రముఖ నటుడు, బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, తన భార్య గౌరీతో కలిసి ముంబయి బాంద్రా(పశ్చిమ)లోని 177వ నెంబరు పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

16:13 October 21

రెండు రాష్ట్రాల్లో పోలింగ్​ శాతాలిలా..

మహారాష్ట్ర ఎన్నికల్లో... బచ్చన్​ కుటుంబం ఓటు వినియోగించుకుంది. ముంబయి జుహు నియోజకవర్గంలో జయా బచ్చన్​, అభిషేక్​ బచ్చన్​, ఐశ్వర్యారాయ్​ బచ్చన్​ ఓటు వేశారు. 

15:48 October 21

ఓటేసిన బాలీవుడ్​ బాద్​షా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్​ నటీనటులు, పారిశ్రామిక వేత్తలు, సాధారణ ప్రజానీకం ఓటేయడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ముంబయి బాంద్రాలోని పోలింగ్​ బూత్​లో.... బాలీవుడ్​ భామ దీపికా పదుకొనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

15:48 October 21

బచ్చన్​ కుటుంబం ఓటు వినియోగం

అలనాటి బాలీవుడ్​ నటి షబానా అజ్మీ ముంబయిలో ఓటు వేశారు. ఆమె వెంట ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్​ ఉన్నారు. ​ 

15:11 October 21

బాంద్రాలో ఓటేసిన బాలీవుడ్​ బాద్​షా

ప్రముఖ బాలీవుడ్​ నటులు అనిల్​ కపూర్​, హృతిక్​ రోషన్​ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంధేరీ(పశ్చిమ)లోని పోలింగ్​ బూత్​లో వీరిరువురూ ఓటేశారు. 

14:55 October 21

బాంద్రాలో బాలీవుడ్​ భామ పదుకొనే ఓటు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 30.89 శాతం ఓటింగ్​ నమోదైంది. పోలింగ్​ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. అక్టోబర్​ 24న ఫలితాలు వెల్లడించనున్నారు. 

14:52 October 21

ఓటేసిన షబానా అజ్మీ-జావేద్​ అక్తర్​ దంపతులు

హరియాణా శాసనసభ ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు 25 శాతం పోలింగ్​ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే ఓటింగ్​ ప్రారంభమైంది.  

14:49 October 21

ఓటేసిన హృతిక్​ రోషన్​, అనిల్​ కపూర్​

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముంబయిలోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటేశారు. ఈ సందర్భంగా 93 ఏళ్ల రిటైర్డ్​ ఆర్మీ మెన్​ ఖన్నాజీని ఉదాహరణగా చూపుతూ... ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరూ ఓటేయడానికి పోలింగ్​ బూత్​లకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

14:47 October 21

ఒంటిగంట వరకు 30.89 శాతం పోలింగ్​

భాజపా ఎంపీ, ప్రముఖ బాలీవుడ్​ నటి హేమమాలిని అంధేరీ(పశ్చిమ) నియోజకవర్గంలోని పోలింగ్​బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

14:46 October 21

మధ్యాహ్నానికి హరియాణాలో 25 శాతం ఓటింగ్​

ప్రముఖ బాలీవుడ్​ నటుడు గోవిందా... ఆయన భార్యతో కలిసి అంధేరీ(పశ్చిమ)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

13:37 October 21

హరియాణాలో మధ్యాహ్నానికి 25 శాతం పోలింగ్​

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ జోరుగా సాగుతోంది. భారత క్రికెట్​ దిగ్గజం, మాజీ ఆటగాడు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ ముంబయి పశ్చిమ బాంద్రా పోలింగ్​ బూత్​లో కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సచిన్​ వెంట ఆయన భార్య అంజలి, కుమారుడు అర్జున్​ ఉన్నారు. 

13:30 October 21

ముంబయిలో ఓటేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్​, హరియాణా పెహోవా భాజపా అభ్యర్థి సందీప్​ సింగ్​ కురుక్షేత్రలోని పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

13:28 October 21

బాలీవుడ్​ డ్రీమ్​గర్ల్​ హేమమాలిని ఓటు

శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే... ముంబయి తూర్పు బాంద్రాలోని పోలింగ్ కేంద్రంలో భార్య రష్మి, కుమారులు ఆదిత్య, తేజతో కలిసి ఓటు వేశారు. 

ఆదిత్య ఠాక్రే ఈ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది ఆయనే.

12:55 October 21

అంధేరీలో ఓటేసిన గోవిందా

మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్​ భూపతి, భార్య, నటి లారా దత్తాతో కలిసి ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలో ఓటు వేశాడు. 

12:28 October 21

కుటుంబసమేతంగా ఓటేసిన మాస్టర్​ బ్లాస్టర్​

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్... నాగ్​పుర్​లోని ఓ పోలింగ్ కేంద్రంలో తల్లి సరిత, భార్య అమృతతో కలిసి ఓటు వేశారు. 

12:13 October 21

భారత హాకీ మాజీ కెప్టెన్​ ఓటు వినియోగం

బాలీవుడ్ తార మాధురి దీక్షిత్ ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసింది.

12:02 October 21

హరియాణాలో ఓటేసిన భూపిందర్​ హుడా

బాలీవుడ్ నటుడు రితేశ్​ దేశ్​ముఖ్​, అతడి భార్య, నటి జెనీలియా డిసౌజా లాతూర్​లోని ఓటు వేశారు. 

రితేశ్​ సోదరులు అమిత్​, ధీరజ్ ఈ ఎన్నికల్లో లాతూర్​ సిటీ, లాతూర్ రూరల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్​ అభ్యర్థులుగా పోటీ చేశారు. 

11:34 October 21

ఓటు వేసిన ఠాక్రే కుటుంబం

మహారాష్ట్ర, హరియాణాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 5.46శాతం ఓట్లు పోలయ్యాయి. హరియాణాలో 8.73శాతం పోలింగ్ నమోదైంది. 

10:43 October 21

మహేశ్, లారా కలిసి...

ముంబయి జుహూలోని ఓ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగ దంపతులు ఓటు వేశారు.

10:41 October 21

తల్లి, భార్యతో కలిసి...

మహారాష్ట్ర లాతూర్​లో జోరుగా వర్షం కురుస్తోంది. ఆ వానలోనే ఓట్లు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. 

10:36 October 21

మాధురి ఓటు ఎవరికో...?

జననాయక్​ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్​ చౌతాలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హరియాణాలోని సిర్సా పోలింగ్​ కేంద్రానికి ట్రాక్టర్​పై కుటుంబంతో సహా చేరుకుని ఓటు వేశారు. 

10:34 October 21

ఓటేసిన 'హాసిని'...

​నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు ప్రఫుల్​ పటేల్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర గోండియా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రానికి తన భార్య వర్షతో చేరుకును ఓటు వేశారు. ఇదే స్థానం నుంచి భాజపా తరఫున గోపాల్​ అగర్వాల్​,  కాంగ్రెస్​ నుంచి అమర్​ వరదే బరిలో ఉన్నారు. 
 
10:15 October 21

సైకిల్​పై సీఎం...

రెజ్లింగ్​ క్రీడాకారులు బబితా ఫోగాట్​, గీతా ఫోగాట్​లు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హరియాణా ఛర్ఖి దాద్రి నియోజకవర్గంలోని బలాలి పోలింగ్​ కేంద్రలో ఓటు వేశారు. బబితా ఫోగాట్​ ఛర్ఖి నియోజకవర్గం నుంచి భాజపా టికెట్​పై పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థిగా నిర్​పేందర్​ సింగ్​ సంగ్వాన్​, జేజేపీ అభ్యర్థి సత్యపాల్​ సంగ్వాన్​ బరిలో ఉన్నారు. 

10:06 October 21

ఆమిర్​ పిలుపు

ఒలంపిక్​ పతక విజేత, హరియాణాలోని బరోడా నియోజకవర్గ భాజపా అభ్యర్థి యోగేశ్వర్​దత్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోనిపట్​లోని పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఇదే స్థానం నుంచి బరిలో నిలుస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి క్రిషన్​ హూడాపై పోటీ చేస్తున్నారు దత్​. 
 
10:04 October 21

హరియాణాలో జోరుగా పోలింగ్...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​. ఈ కూటమికి 225 సీట్లు వస్తాయని తెలిపారు. విపక్షాలను విశ్వసనీయతను కోల్పోయాయన్నారు. ప్రజలు మోదీ, ఫడణవీస్​ల పక్షాన ఉన్నారని చెప్పారు. 
 
09:56 October 21

దివ్యాంగ దంపతుల స్ఫూర్తి...

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్​పుర్​లోని పోలింగ్​ కేంద్రానికి భార్య కాంచన్​తో వచ్చి ఓటు వేశారు. ఓటింగ్​ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

09:50 October 21

ఓటేసిన శిందే కుటుంబం

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్​పుర్​లోని పోలింగ్​ కేంద్రానికి భార్య కాంచన్​తో వచ్చి ఓటు వేశారు. ఓటింగ్​ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

09:47 October 21

జోరు వానలోనే...

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్​పుర్​లోని పోలింగ్​ కేంద్రానికి భార్య కాంచన్​తో వచ్చి ఓటు వేశారు. ఓటింగ్​ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

09:28 October 21

ట్రాక్టర్​పై పోలింగ్​ కేంద్రానికి 'జేజేపీ' నేత

హరియాణా ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షురాలు కుమారి సెల్జా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిసార్ నియోజకవర్గంలోని యశోదా పబ్లిక్​ స్కూల్​ పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్​ శాతాన్ని పెంచాలన్నారు. 

09:12 October 21

ఓటు వేసిన ఎన్సీపీ నేత ప్రఫుల్​ పటేల్

మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్

17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు

ఉత్తరప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్‌లో 5 స్థానాలకు ఉపఎన్నికలు

అసోం 4, హిమాచల్‌ప్రదేశ్‌ 2, తమిళనాడులో 2 సీట్లకు ఉప ఎన్నికలు

పంజాబ్‌లో 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్‌లో 2 సీట్లకు ఉప ఎన్నికలు

అరుణాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశాలో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, మేఘాలయలో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌, ఈనెల 24న ఓట్ల లెక్కింపు

09:04 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న ఫోగాట్​ కుటుంబం

మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్​ కొనసాగనుంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 51 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

08:44 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న యోగేశ్వర్​ దత్​

హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 1,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 105 మంది మహిళలున్నారు. 85 లక్షల మంది మహిళలతో సహా మొత్తం కోటీ 83 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

హరియాణా అసెంబ్లీ పోరు వివరాలు

  • నియోజకవర్గాలు : 90
  • అభ్యర్థులు : 1,169
  • ఓటర్లు : 1,83,00000
  • పోలింగ్​ కేంద్రాలు : 19,578
  • భద్రతా సిబ్బంది : 75,000
  • వీవీప్యాట్ యంత్రాలు: 27,611

08:33 October 21

'భాజపా-శివసేన కూటమికి 225 సీట్లు'

సార్వత్రిక సమరం తర్వాత దేశంలో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఆసన్నమైంది. మరికాసేపట్లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

288 అసెంబ్లీ స్థానాలకు గానూ 3 వేల 237 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 235 మంది మహిళలు. 8 కోట్ల 98లక్షల 39వేల 600మంది ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు.

పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా దాదాపు 3లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లలో డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షించనుంది.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల వివరాలు

  • నియోజకవర్గాలు : 288
  • అభ్యర్థులు : 3,237
  • ఓటర్లు: 8,98,39,600
  • పోలింగ్ కేంద్రాలు:  96,661
  • భద్రతా సిబ్బంది: 3,00,000
  • పోలింగ్ సిబ్బంది: 6,500,000
  • వీవీప్యాట్ యంత్రాలు: 1,35,021

08:26 October 21

కుటుంబ సమేతంగా ఓటు వేసిన నితిన్​ గడ్కరీ

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

08:21 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న టిక్​టాక్​ స్టార్​

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

08:14 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న హరియాణా కాంగ్రెస్​ అధ్యక్షురాలు

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

07:19 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న ఆరెస్సెస్​ చీఫ్​

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

07:17 October 21

కొనసాగుతున్న పోలింగ్​

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

07:15 October 21

రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు చేయాలి : మోదీ

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

07:03 October 21

మొదలైన పోలింగ్​

06:47 October 21

హరియాణా ఎన్నికల సంక్షిప్త వివరాలు

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

06:45 October 21

మహారాష్ట్ర ఎన్నికల సంక్షిప్త వివరాలు

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

06:32 October 21

మరోమారు భాజపానే.. ఎగ్జిట్​పోల్స్​ అంచనా..!

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు సహా 17 రాష్ట్రాల్లోని 51  అసెంబ్లీ  స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Last Updated : Oct 21, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details