మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకూ మోదీ ధన్యవాదాలు తెలిపారు.
లైవ్ : మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలు - మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర, హరియాణా భవితవ్యం
18:49 October 24
మరోసారి అధికారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు: మోదీ
18:38 October 24
హరియాణా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపా తరఫున ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హరియాణా అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని ప్రకటించారు. భాజపా అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి... విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలను కొనియాడారు మోదీ.
17:47 October 24
గవర్నర్‌ను కలవనున్న ఖట్టర్...
హరియాణాలో భాజపాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరడానికి మనోహర్‌లాల్ ఖట్టర్ సిద్ధమయ్యారు. ఈరోజే గవర్నర్‌ను కలుస్తారని సమాచారం.
16:59 October 24
సీఎం కుర్చీని పంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: ఠాక్రే
మహారాష్ట్రలో అధికారాన్ని తిరిగినిలబెట్టుకునే మెజార్టీ సాధించింది భాజపా-శివసేన కూటమి. భాజపాకు 100 స్థానాలవరకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగే భాజపా ముందు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది శివసేన. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని భావిస్తోంది. దీనిని స్పష్టం చేశారు ఉద్ధవ్ ఠాక్రే. అధికారాన్ని పంచుకునే విధాం అమలు చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.
14:07 October 24
దుష్యంత్ చౌతాలా విజయం
హరియాణా శాసనసభ ఎన్నికల్లో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా విజయం సాధించారు. హిసార్‌లోని జింద్ జిల్లా ఉచానా కలన్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
14:05 October 24
రణ్‌దీప్ సుర్జేవాలా ఓటమి
- హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా పరాజయం
- ఖైతాల్‌లో భాజపా అభ్యర్థి లీలారామ్ చేతిలో సూర్జేవాలా
13:32 October 24
కాంగ్రెస్‌తో కలిసి రావాలని జేజేపీకి హుడా పిలుపు
హరియాణాలో భాజపాయేతర ప్రభుత్వ ఏర్పాటుకు జేజేపీ, ఇతరులు.. కాంగ్రెస్‌తో కలిసి రావాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బీఎస్ హుడా కోరారు. అందరం కూటమిగా ఏర్పడి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు.
13:30 October 24
హరియాణా భాజపా అధ్యక్షుడు రాజీనామా..!
మహారాష్ట్రలో భాజపా-శివసేన కూటమి అధికారం నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. అయితే... భాజపాకు గతంకంటే సీట్ల సంఖ్య తగ్గుతోంది. శివసేన కొంతమేర నష్టపోయేట్లు కనిపిస్తోంది. తిరుగుబాటు అభ్యర్థుల కారణంగానే అధికార కూటమి ఆధిక్యం తగ్గినట్లు తెలుస్తోంది.
288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో మొత్తం 75 చోట్ల రెబల్స్ బరిలోకి దిగారు. వీరిలో 38 మంది భాజపాకు వ్యతిరేకంగా, 23 మంది శివసేనకు వ్యతిరేకంగా పోటీ చేసినవారే.
12:43 October 24
మహారాష్ట్రలో భాజపాకు రెబల్స్ పోటు!
- ఆసక్తికరంగా మారిన హరియాణా రాజకీయాలు
- స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో వ్యూహరచనలో ప్రధాన పార్టీలు
- దిల్లీకి రావాలని హరియాణా సీఎం ఖట్టర్‌కు అమిత్ షా పిలుపు
- మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హుడాతో మాట్లాడిన సోనియాగాంధీ
- హరియాణాలో కీలకంగా మారిన జేజేపీ
12:28 October 24
ఆసక్తికరంగా హరియాణా రాజకీయాలు
- పంజాబ్: 4 అసెంబ్లీ ఉపఎన్నికల్లో 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒకచోట అకాలీదళ్ ముందంజ
- తమిళనాడు: 2 అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ అధికార అన్నాడీఎంకే ముందంజ
- గుజరాత్: 6 అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా 3, కాంగ్రెస్ 3చోట్ల ముందంజ
- కేరళ: 5 అసెంబ్లీ ఉపఎన్నికల్లో ముందంజలో సీపీఎం 2, కాంగ్రెస్ 2, ఐయూఎంఎల్ 1
- ఉత్తరప్రదేశ్: 11 అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా 6, ఎస్పీ 2 స్థానాల్లో ముందంజ
- ఉత్తరప్రదేశ్: ఒక్కో స్థానంలో కాంగ్రెస్, బీఎస్పీ, అప్నాదళ్ ముందంజ
లోక్‌సభ
- మహారాష్ట్ర: సతారా లోక్‌సభ ఉపఎన్నికలో ఎన్సీపీ అభ్యర్థి ముందంజ
- బిహార్: సమస్తిపూర్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎల్జేపీ అభ్యర్థి ముందంజ
11:58 October 24
ఉప ఎన్నికల్లో తగ్గిన భాజపా హవా..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో భాజపా-శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. అయితే భాజపా తర్వాత అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న శివసేన.. కమలదళంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా.. లేదా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. భాజాపా-శివసేన కూటమికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
పదవీకాలం చెరిసగం
భాజపాతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని మాత్రం చెరిసగం పంచుకోవాలని కమలం నేతలను కోరనుంది శివసేన. ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని కోరనున్నట్లు సంజయ్ రౌత్ ప్రకటించారు.
11:51 October 24
ముఖ్యమంత్రి పీఠానికై శివసేన డిమాండ్!!
హరియాణా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ హరియాణా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్‌తో మాట్లాడారు. తాజా పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
11:35 October 24
హరియాణా తాజా పరిస్థితులపై సోనియా ఆరా..
( ) మహారాష్ట్ర, హరియాణా ఫలితాలతో పాటే.... 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కిపు ప్రక్రియ కొనసాగుతోంది.
భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరీ, మేఘాలయా, తెలంగాణల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో.. భాజపా 5, బీఎస్పీ 2, ఎస్పీ 2, కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
కేరళలోని ఐదుస్థానాల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి చెందిన ఇద్దరు అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇండియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఒకరు ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర, బిహార్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్ాయి. మహారాష్ట్రలోని సతారాలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంటే.... బిహార్ సమస్తిపూర్‌లో లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థి ముందజలో ఉన్నారు.
11:27 October 24
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు ఇలా..
హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధికార భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 46 సీట్లు సాధించే అవకాశాలు కనిపించటం లేదు. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి.
అధికారం ఎవరిది..?
హంగ్ ఏర్పడితే అధికారం ఎవరిదనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న జేజేపీ... తమకు ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ జేజేపీతో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని స్థానాలు వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ జేజేపీతో పాటు స్వతంత్రులూ కింగ్ మేకర్లుగా నిలిచే అవకాశం ఉంది.
భాజపాతో జేజేపీ జట్టు కడితే ఎలాంటి రాజకీయ ఉత్కంఠ ఉండదు.. కానీ అలా జరగని తరుణంలో అధికార పీఠాన్ని ఎవరు చేజిక్కించుకుంటారన్నది ఆసక్తికరం.
11:21 October 24
'హరియాణా దంగల్'లో గెలుపెవరిది?
- 2014తో పోల్చితే మహారాష్ట్రలో తగ్గిన భాజపా-శివసేన బలం
- 2014లో 185 స్థానాల్లో గెలిచిన భాజపా-శివసేన కూటమి
- మహారాష్ట్రలో పుంజుకున్న ఎన్సీపీ
- ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించుకోనున్న భాజపా-శివసేన
10:53 October 24
తగ్గిన భాజపా-శివసేన బలం
మహారాష్ట్రలో అధికారిక గణాంకాల ప్రకారం భాజపా-శివసేన కూటమి ముందంజలో ఉంది. కమలదళానికి.. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి గట్టిపోటీ ఇచ్చిన్పప్పటికీ స్పష్టమైన మెజారిటీ సాధించేందుకు చాలా దూరంలో నిలిచినట్లు కనిపిస్తోంది.
10:44 October 24
మహారాష్ట్రలో అధికార గణాంకాలు ఇలా ఉన్నాయి
హరియాణా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కనందుకు రాష్టంలో హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. హరియాణాలో మొత్తం 90 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. భాజపా స్వల్ప అధిక్యంలో ఉన్నప్పటికీ రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అధికార పార్టీకి గట్టి పోటీనిస్తోంది. ఈ దశలో జననాయక్ జనతా పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశలూ లేకపోలేదు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.
10:27 October 24
హంగ్ దిశగా హరియాణా అసెంబ్లీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. భాజపా-శివసేన కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఊహించినదానికన్నా ఎక్కువ స్థానాల్లో జోరు కనబరుస్తోంది. తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శాసనసభ ఎన్నికలు ఈనెల 21న ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ భాజపాకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. కానీ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ తేల్చినంత ఏకపక్షంగా ఫలితాలు ఉండబోవనేది స్పష్టంగా తెలుస్తోంది.
10:24 October 24
'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..
- పశ్చిమ మహారాష్ట్ర స్థానాల్లో ఎన్సీపీ ఆధిపత్యం
- పశ్చిమ మహారాష్ట్రలో మొత్తం 56 స్థానాలు
- భాజపా కూటమి 22, కాంగ్రెస్ కూటమికి 28, ఇతరులు 6 చోట్ల ముందంజ
- పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీ- 20, కాంగ్రెస్ 8 చోట్ల ఆధిక్యం
పుణె
- పుణెలో 20 సీట్లలో భాజపా, కాంగ్రెస్ పోటాపోటీ
- పుణెలో చెరో 10 సీట్లలో కాంగ్రెస్, భాజపా ఆధిక్యం
10:14 October 24
పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీ హవా..
- మరఠ్వాడా ప్రాంతంలో 4 జిల్లాల్లో కనిపించని ఎన్సీపీ- కాంగ్రెస్
- మరఠ్వాడా ప్రాంతంలో 43 సీట్లకుగాను 26 స్థానాల్లో భాజపా ముందంజ
- మరఠ్వాడా ప్రాంతంలో 5 స్థానాల్లో ఇతరులు ముందంజ
- మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో భాజపా ఆధిపత్యం
- మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో 2 స్థానాల్లో భాజపా ముందంజ
10:13 October 24
మరఠ్వాడాలో భాజపా జోరు..
- ముంబయి మహానగరంలో కనిపించని ఎన్సీపీ ప్రభావం
- ముంబయి అర్బన్, సబర్బన్ ప్రాంతాల్లో భాజపా-శివసేన సంపూర్ణ ఆధిక్యం
- ముంబయి మహానగరంలోని 35 సీట్లకుగాను 30 స్థానాల్లో భాజపా కూటమి ముందంజ
- ముంబయి మహానగరంలో కేవలం 2 స్థానాల్లోనే కాంగ్రెస్ ముందంజ
- మహరాష్ట్ర: వర్లిలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ముందంజ
- మహారాష్ట్ర: రెండు స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులు ముందంజ
09:58 October 24
మహా నగరంలో ఎన్సీపీ ప్రభావం 'నిల్'
మహారాష్ట్ర, హరియాణా ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ అధికార భాజపా పక్షం ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.
మహారాష్ట్రలో ఇలా..
మహారాష్ట్రలో భాజపా-శివసేన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాల్ని మించి కాంగ్రెస్-ఎన్సీపీ జోరు చూపుతోంది. అయితే కాంగ్రెస్ కన్నా ఎన్సీపీ ముందంజలో ఉండటం విశేషం.
హరియాణాలో స్వల్ప ఆధిక్యం
హరియాణాలో కమలదళం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జేజేపీ, ఇతరులు.. కింగ్ మేకర్ పాత్ర పోషించగలరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
09:56 October 24
ఎగ్జిట్‌పోల్స్ అంచనాల్ని మించి కాంగ్రెస్-ఎన్సీపీ జోరు
- హరియాణా అంబాలా, రోహతక్ ప్రాంతాల్లో భాజపా, కాంగ్రెస్ పోటాపోటీ
- హరియాణా గుర్గావ్ ప్రాంతంలో భాజపా అభ్యర్థుల ముందంజ
- హరియాణా హిస్సార్ ప్రాంతంలో జేజేపీ అభ్యర్థుల ఆధిక్యం
09:33 October 24
హరియాణా పలు ప్రాంతాల్లో భాజపా-కాంగ్రెస్ పోటాపోటీ!
- మహారాష్ట్ర: కొంకణ్ ప్రాంతంలో శివసేన ఆధిక్యం
- ముంబయి నగరంలో భాజపా, శివసేన కూటమి ముందంజ
- మరాఠ్వాడా ప్రాంతంలో భాజపా, శివసేన కూటమి ముందంజ
- ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీ అభ్యర్థుల ముందంజ
- మహారాష్ట్ర: విదర్భలో భాజపా అభ్యర్థుల ముందంజ
09:32 October 24
మహారాష్ట్రలో కమలం జోరు
- మహారాష్ట్ర, హరియాణాలో ముందంజలో అధికార భాజపా
- వర్లిలో 6000 ఓట్ల ఆధిక్యంలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే
- వెనుకంజలో బీజేపీ మంత్రి పంకజా ముండే
- కర్నాల్‌లో ఆధిక్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్
- నాగ్‌పూర్ నైరుతిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ముందంజ
- గర్హి సంప్లా-కిలోయిలో హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ముందంజ
- హరియాణా ఖైతాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సూర్జేవాలా ఆధిక్యం
- మహారాష్ట్రలో మరోసారి అధికారంలోకి రానున్న భాజపా-శివసేన
- మహారాష్ట్రలో చతికిలబడిపోయిన కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి
- హరియాణాలోనూ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న భాజపా
- మహారాష్ట్రలో వందకు పైగా స్థానాల్లో భాజపా కూటమి ఆధిక్యం
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 145
- హరియాణాలో వెనుకబడిన భాజపా అభ్యర్థి రెజ్లర్ బబితా ఫొగట్
- కేరళ ఎర్నాకుళం అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ ముందంజ
- ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాల్లో సమాజ్‌వాదీ, ఒక స్థానంలో బీఎస్పీ ముందంజ
09:08 October 24
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకంజ
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఎస్పీ-1, ఎస్పీ-2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.
09:05 October 24
ఉత్తర ప్రదశ్ ఉపఎన్నికల్లో ముందంజలో ఎస్పీ, బీఎస్పీ
- మహారాష్ట్ర, హరియాణాలో ముందంజలో అధికార భాజపా
- ఆధిక్యంలో శివసేన యువజన విభాగం నాయకుడు ఆదిత్య ఠాక్రే
- మహారాష్ట్ర: ఆధిక్యంలో భాజపా మంత్రి పంకజా ముండే
- కర్నాల్‌లో ఆధిక్యంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్
08:55 October 24
మహారాష్ట్రలో ముందంజలో భాజపా
హరియాణాలో అసెంట్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా-కాంగ్రెస్ మధ్య రసవత్తరంగా సాగిన ఎన్నికల పోరులో ప్రజాతీర్పు ఎవరి వైపు ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
08:49 October 24
ఆధిక్యంలో ఖట్టర్, ఠాక్రే
హరియాణాలో అసెంట్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా-కాంగ్రెస్ మధ్య రసవత్తరంగా సాగిన ఎన్నికల పోరులో ప్రజాతీర్పు ఎవరి వైపు ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
08:43 October 24
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
హరియాణాలో అసెంట్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా-కాంగ్రెస్ మధ్య రసవత్తరంగా సాగిన ఎన్నికల పోరులో ప్రజాతీర్పు ఎవరి వైపు ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
08:02 October 24
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లో మరో 51 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. అలాగే మహారాష్ట్ర (సాతారా), బిహార్ (సమస్తిపుర్) లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరీ, మేఘాలయా, తెలంగాణల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఓటర్లు భాజపా వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇదివరకే వెల్లడించాయి.
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 51 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉప ఎన్నికలు. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
07:35 October 24
సర్వత్రా ఆసక్తికరం.. కొద్ది క్షణాల్లో లెక్కింపు ప్రారంభం
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లో మరో 51 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. అలాగే మహారాష్ట్ర (సాతారా), బిహార్ (సమస్తిపుర్) లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరీ, మేఘాలయా, తెలంగాణల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఓటర్లు భాజపా వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇదివరకే వెల్లడించాయి.
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 51 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉప ఎన్నికలు. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
07:05 October 24
మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర, హరియాణా భవితవ్యం
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లో మరో 51 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. అలాగే మహారాష్ట్ర (సాతారా), బిహార్ (సమస్తిపుర్) లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరీ, మేఘాలయా, తెలంగాణల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఓటర్లు భాజపా వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇదివరకే వెల్లడించాయి.
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 51 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉప ఎన్నికలు. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.